నూనె మీద కాలు వేసి జారి పడి తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్తే ఏంటి పరిస్థితని అమాయకంగా మొహం పెడుతుంది. ఏయ్ ఆపు అంత దూరం నేను ఆలోచించలేదు. కిందపడితే మీ ఇంటికి వెళ్ళకుండా ఉంటావనే ఆలోచించానని చెప్తాడు. ఆ వీడియో డిలీట్ చేయడానికి ఎంత డబ్బులు కావాలో అడగమంటాడు. తనకి డబ్బు కాదని అవసరమైనప్పుడు పని చేయించుకుంటానని చెప్పేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే కళావతి అప్పుడప్పుడు ఆడుకుంటుందా అని ఏడుపు మొహం పెట్టేస్తాడు. కళ్యాణ్ అనామిక ఫోన్ నెంబర్ ద్వారా అడ్రస్ పట్టుకుని అప్పుని తీసుకుని వస్తుంది. ఆ ఇల్లు కాస్త పిచ్చేశ్వరావు సైకాలజిస్ట్ అని పేరు ఉంటుంది. కళ్యాణ్ లోపలికి వెళ్ళగానే డాక్టర్ మీకోసమే ఎదురుచూస్తున్నానని షాక్ ఇస్తాడు. తనకి పిచ్చి లేదని చెప్పినా కూడా డాక్టర్ మాత్రం వినకుండా కళ్యాణ్ ని చెక్ చేస్తాడు. కాసేపు ఇద్దరూ వాదించుకుంటారు. అది చూసి అప్పు కాసేపు నవ్వుకుంటుంది.
కావ్య పుట్టింటికి వెళ్లేందుకు రెడీ అయ్యి సీతారామయ్య దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఇంద్రాదేవి: కంటే కూతుర్నే కనాలని ఎవరు చెప్పారో కానీ నిన్ను చూస్తుంటే నీలాంటి కూతురు నాకు లేదే అనే వెలితి కనిపిస్తుంది. నిజంగా నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు. మేమంతా నిన్ను అపార్థం చేసుకున్నాం. చివరికి నువ్వే గెలిచావ్. ఇంట గెలిచావ్.. రచ్చ కూడా గెలిచావ్. మా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి
Also Read: కీలక మలుపు, తల్లికాబోతున్న వేద- యష్ కి నీలాంబరి సాయం, తప్పించుకున్న మాళవిక
సీతారామయ్య: నువ్వు నోరు తెరిచి పుట్టింటికి డబ్బు కావాలని అడిగితే సంతోషంగా ఇచ్చేవాడిని కానీ నువ్వు చెయ్యి చాచి అడగలేదు. ఎక్కడ ఎవరినీ ఆశించలేదు. నీ కష్టాన్ని నీ కళని నమ్ముకున్నావ్. నీ తండ్రి నీకు ఇచ్చిన ఆస్తి అది నీకు ఎదురే లేదు వెళ్ళమ్మా
కావ్య ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంటే ఎవరికని పెద్దాయన అడుగుతాడు. ఆటో బుక్ చేసుకుంటున్నానని చెప్తుంది. ఇన్ని కార్లు ఉంటే ఎందుకు ఆటో అంటారు. రాజ్ ఉన్నాడు కదా అని ఇంద్రాదేవి అంటుంది. అపర్ణ కావ్యని పుట్టింటికి వెళ్తుందని మళ్ళీ తిట్ల దండకం మొదలుపెడుతుంది. ఆటో బుక్ చేసుకుని వెళ్తానని కావ్య వెళ్తుంటే శుభాష్ ఆపుతాడు.
శుభాష్: నువ్వు ఇంటి కోడలివి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు కారులోనే వెళ్ళాలి
సీతారామయ్య: రాజ్ ఇక నుంచి నువ్వే నీ భార్యని కారులో డ్రాప్ చేయాలి. కావ్యని డ్రాప్ చేసిన తర్వాత అటు నుంచి ఆఫీసుకి వెళ్ళు
కాసేపు అపర్ణ భర్త, కొడుకుని కలిపి సెటైర్లు వేసి పంపిస్తుంది. అదంతా చూస్తూ ఉన్న రాహుల్ బ్యాచ్ రగిలిపోతుంది. పుట్టిల్లు కోసం పోరాడి హక్కులు సాధించుకున్న కావ్య చివరికి ఆ పుట్టింటికే చేరాలని రుద్రాణి మరో స్కెచ్ వేసేందుకు సిద్ధమవుతుంది. రాజ్ మొహం చిరాకుగా పెట్టుకుని కావ్యని తీసుకుని బయల్దేరతాడు. మళ్ళీ కావ్య అమాయకపు యాక్షన్ మొదలుపెట్టేస్తుంది. ఇద్దరూ వాదులాడుకుంటారు. మళ్ళీ రాజ్ అంతరాత్మ దిగబడుతుంది.
అంతరాత్మ: నా పెళ్ళాన్ని కింద పడేస్తాను అంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నిన్ను అడ్డంగా ఇరికించేశా
రాజ్: అసలు నువ్వు నా ఆత్మవేనా
అంతరాత్మ: అసలు నువ్వు నా శరీరానివేనా? నా ఇష్టాయిష్టాలు పట్టించుకోవా? ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఒక ముద్దు లేదు ముచ్చట లేదు. పైగా ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటావ్.
రాజ్: చీ దీనితో ముద్దు ముచ్చట
Also Read: నిజం చెప్పకుండా నందుని బంధించిన మురారీ- కన్నీళ్ళతో అత్తింటిని వీడిన కృష్ణ
అంతరాత్మ: అందుకేనమ్మా బయటకి వచ్చాను. ఒకసారి మన పెళ్ళాన్ని చూడు
రాజ్: అస్తమానం మన పెళ్ళాం అనకు అనేసి సీరియస్ అవుతాడు. అంతరాత్మ కావ్య మీద చెయ్యి వేయబోతుంటే చంపేస్తానని అంటాడు.
అంతరాత్మ: నీలాంటి రసహీనుడు లేడు. తను చూడు ఎంత అందంగా ఉందో.. కళ్ళతో మత్తెక్కిస్తుంది. పెదాలు గులాబీ రేకుల్లా మెరిసిపోతున్నాయ్
రాజ్: బాగా కరువులో ఉన్నట్టు ఉన్నావ్
అంతరాత్మ: నేను కరువులో ఉంటే నువ్వు కూడా ఉన్నట్టేరా వేస్ట్ ఫెలో.. ఆ బుగ్గలు చూడు బూరెలాగా భలే ఉన్నాయి. నా బూరె బుగ్గల సుందరి అని ముద్దు పెట్టుకోబోతుంటే రాజ్ గట్టిగా అరిచేసి పొరపాటున కావ్య చెంప మీద కొడతాడు
స్వప్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. కానీ నెగటివ్ రావడంతో కోపంగా తన ఫ్రెండ్ సాక్షికి ఫోన్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్తుంది. తనకి అంత టైమ్ లేదని వెంటనే తెలిసిపోవాలని ఆవేశపడిపోతుంది. కొన్నేళ్ళు ఎదురుచూసినా పిల్లలు కలగని వాళ్ళు చాలా మంది ఉన్నారు వెయిట్ చేయమని అంటుంది. ఒకవేళ రాహుల్ కి పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే తన పరిస్థితి ఏంటని భయపడుతుంది. అప్పుడే రాహుల్ వచ్చి ఏంటి ఎందుకు ఇందాక అరిచావు అని అడుగుతాడు.
స్వప్న: కావ్య అడగకపోయినా రాజ్ తనని దింపడానికి వెళ్ళాడు. కానీ నీలో ఆ ప్రేమ ఉందా?
రాహుల్: ఎందుకు నన్ను వాడితో పోలుస్తున్నావ్. నాకు ఇంట్లో అంత పవర్స్ ఏమి లేవు. నువ్వు వచ్చిన తర్వాత నా పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అసలు ఆ రోజు నీతో హోటల్ లో కలవకపోయి ఉంటే నాకు ఇన్ని బాధలు వచ్చేవి కావు. మాటలు పడే వాడిని కాదు. దీనికి కారణం నీ ప్రెగ్నెన్సీ అదే లేకపోతే ఇంట్లో నా పరిస్థితి వేరేలా ఉండేది
స్వప్న: నువ్వు మాత్రమే కాదు నేను అనుభవిస్తున్నా. కడుపుతో పెళ్లి చేసుకుని ఇంటికి రావడం వల్ల కావ్యకి దక్కుతున్న మర్యాద నాకు దక్కడం లేదు. అసలు నన్ను కోడలిగానే చూడటం లేదు
రాహుల్: నీకు కడుపు లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునే వాడిని కాదు కదా అనేసి విసురుగా వెళ్ళిపోతాడు.