పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్‌ కార్యాలయాల్లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గేట్‌-2024 ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌, బీఎస్సీతోపాటు గేట్-2024 పరీక్షకు హాజరవుతున్నవారు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయానికి ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్‌ వివరాలు వెల్లడించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్‌ ఈ-2 హోదాలో పీజీసీఐఎల్‌ పరిధిలోని నార్తర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిశా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా ఇస్తారు.

వివరాలు.. 

* ఇంజినీర్‌ ట్రైనీ 

విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌-2024 ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

ముఖ్యమైన తేదీలు… 


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16.01.2024.


ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 18.02.2024.


గేట్-2024 దరఖాస్తుకు చివరితేది: 29.09.2023.


Notification


GATE-2024 Application


Website


ALSO READ:


ఎన్‌ఐఈ, చెన్నైలో 47 టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు
చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రస్తుతానికి ఉద్యోగ ప్రకటన మాత్రమే సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..