Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

Astrological prediction for September 29th, 2023

Continues below advertisement

మేష రాశి
ఈ రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది.  శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. చేసేపనిలో ఆటంకాలు ఉండవచ్చు. కాస్త ఓపికగా వ్యవహరించాలి. అధిక కోపం మీకు ప్రమాదం.  కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భౌతిక సుఖాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి
ఈ రాశివారి ఏదో విషయంలో ఆందోళన చెందుతారు. అదనపు ఖర్చులుంటాయి. మేధోపరమైన పనిలో బిజీగా ఉంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆదాయం బావుంటుంది. కోపం వచ్చినా వెంటనే కూల్ అవుతారు. కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కొంతమంది పాత స్నేహితులతో సన్నిహితంగా ఉంటారు. రుచికరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.  తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు.

మిథున రాశి
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనవసరమైన కోపం మరియు చర్చలకు దూరంగా ఉండండి. జీవన జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక అశాంతి ఉంటుంది, కానీ మాట ప్రభావం పెరుగుతుంది. వ్యాపారం ఊపందుకుంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. 

Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

కర్కాటక రాశి
మానసిక ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావొచ్చు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పిల్లలు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ తల్లి నుంచి డబ్బు అందుకుంటారు.

సింహ రాశి
విద్యార్థులు చదువుపై మాత్రమే దృష్టి సారించాలి. ఉద్యోగులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు అలాగే  ఉంటాయి. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు.

కన్యా రాశి
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. వ్యాపారం మెరుగుపడుతుంది. లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఏదో చికాకు వెంటాడుతుంది. 

Also Read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..

తులా రాశి
ఈ రాశివారి వ్యాపారులు మంచి లభాలు పొందుతారు. మీరు మీ త ల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. సంభాషణలో ఓపికగా ఉండండి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక కోపాన్ని నివారించండి. మీరు ఒక గొప్ప వ్యక్తిని కలుస్తారు. పిల్లలతో విభేదాలు రావచ్చు.

వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురోగతి ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీరు కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. బట్టలు మొదలైన వాటి పట్ల మొగ్గు పెరుగుతుంది. మనసులో ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. 

ధనుస్సు రాశి
ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉండవచ్చు. మీరు స్నేహితుడి నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం లేదంటే ఉద్యోగపనిపై వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు. కుటుంబ సమస్యలు పెరగవచ్చు. సంభాషణలో ఓపికగా ఉండండి. 

మకర రాశి
మానసిక ప్రశాంతత ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ మీకుంటుంది.  వ్యాపారంలో లాభాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది.  మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. మాటలో కర్కశత్వం  ఉంటుంది. సంభాషణలో సమతుల్యత ఉండండి. మనసులో కోపము, సంతోష క్షణాలు ఉంటాయి. కార్యాలయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది.

కుంభ రాశి
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. కొన్ని విషయాల్లో స్వీయ నియంత్రణలో ఉండండి. కోపం తగ్గించుకోవడం మంచిది. మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి స్నేహితుని నుంచి సహాయం పొందవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆశ నిరాశ మిశ్రమ భావాలు మనస్సులో ఉంటాయి. పిల్లల విషయంలో సంతోషం ఉంటుంది. కళలు, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి

మీన రాశి
ఈ రాశివారికి పూర్తి విశ్వాసం ఉంటుంది కానీ మనస్సు ప్రతికూల ఆలోచనలతో ప్రభావితమవుతుంది. మాటల్లో జాగ్రత్త. ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఆదాయంలో ఇబ్బందులు, ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

Continues below advertisement