ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా ఒమిక్రాన్ ప్రభావం సుప్రీం కోర్టుపై కూడా పడింది. దీంతో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు కార్యకలాపాలను తిరిగి వర్చువల్‌గా చేపట్టేందుకు సిద్ధమైంది. 


దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్​ సహా కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి వర్చువల్​ విచారణలు చేపట్టనుంది. రెండు వారాల పాటు అన్ని కేసుల విచారణలు వర్చువల్​గానే ఉండనున్నాయి. 


శీతాకాలం సెలవులు


శీతాకాల సెలవుల్లో ఉన్న సుప్రీం కోర్టు జనవరి 3న తిరిగి తెరుచుకోనుంది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి సుప్రీం కోర్టు విచారణ వీడియో కాన్ఫరెన్స్​లోనే జరిగింది. అక్టోబర్​ 7న మళ్లీ భౌతిక విచారణ ప్రారంభమైంది.


ఒమిక్రాన్ ఎఫెక్ట్..


దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. తాజాగా బంగాల్ కూడా ఆ జాబితాలో చేర్చింది. వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు దీదీ సర్కార్ సిద్ధమైంది. సోమవారం నుంచి జనవరి 15 వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు బంగాల్ సర్కార్ ప్రకటించింది.


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1500 మార్కు దాటింది. ప్రస్తుతం 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్రలో టాప్‌లో ఉంది. రాజస్థాన్‌లో కూడా ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరిగాయి.


మరోవైపు కరోనా వ్యాప్తి కూడా భారీగా పెరిగింది. కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదుకాగా 284 మంది మృతి చెందారు. 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,801కి చేరింది. 


Also Read: PM Modi Meerut Visit: ఎన్నికలకు ముందు రూ.700 కోట్లతో స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన


Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!


Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు


Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి