ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తున్నారు. తాజాగా మేరట్‌లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన చేశారు.
అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. మేరఠ్‌లో షహీద్ స్మారక్ వద్ద స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పించారు. అక్కడే ఉన్న మ్యూజియంను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో కలిసి సందర్శించారు
రూ.700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోన్న మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయంలో హాకీ, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, టెన్నిస్ మైదానాలు, బాస్కెట్ బాల్, వాలీబాల్, జిమ్నాసియం హాల్, రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ వంటి క్రీడావసతులను ఏర్పాటు చేయనున్నారు.
షూటింగ్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ వంటి ఇతర క్రీడా సౌకర్యాలను నెలకొల్పనున్నారు. 540 మంది పురుషులు, 540 మంది మహిళా క్రీడాకారులకు శిక్షణనిచ్చే సామర్థ్యంతో ఈ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు.
Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
Also Read: Omicron Cases in India: దేశంలో జెట్ స్పీడుతో ఒమిక్రాన్ వ్యాప్తి.. 1500 మార్కు దాటిన కేసులు
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి