కరోనా బారిన పడకుండా ఉండేందుకు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో.. కరోనా బారిన పడి కోలుకున్న అనంతరం అంతే జాగ్రత్తలు అవసరం. కోవిడ్‌-19 సోకిన‌ప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దాని ప్రభావం ఉంటుంది. కరోనా వైరస్‌ నుంచి తొందరగానే కోలుకున్నా... మానసికంగా కోలుకోవాలంటే చాలా రోజులే పడుతుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండటం ఎంతో అవసరం. 


Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు


దృఢంగా మారేందుకు... 
* స్నేహితులు, స‌న్నిహితుల‌తో మాట్లాడుతూ ఉండాలి. 
* త‌గినంత విశ్రాంతి తీసుకోవాలి.
* మంచి ఆహారం తీసుకుంటూ... వ్యాయామం చేస్తూ ఉండాలి.
* రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వీలుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. 
* కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి అందుతుంది. 
* ప‌ప్పులు, గుడ్లు, చికెన్‌, చేప‌లు, మాంసం, పాలు, పాల ఉత్ప‌త్తుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి.
* తుల‌సి, దాల్చిన చెక్క‌, మిరియాలు, సొంటి, ఎండు ద్రాక్ష‌లు, బెల్లంతో చేసిన హెర్బ‌ల్ టీని రోజులో ఒక‌టి లేదా రెండుసార్లు తీసుకోవాలి.
*  గ్లాసు వేడి పాల‌ల్లో చిటికెడు ప‌సుపు వేసుకుని రోజులో ఒక‌టి లేదా రెండు సార్లు తాగాలి.
*  డీ హైడ్రేట్ అవ్వ‌కుండా ఉండేందుకు త‌గిన‌న్ని నీళ్లు తాగాలి.
* ఆల్క‌హాల్‌, స్మోకింగ్‌, టుబాకోకు దూరంగా ఉండాలి. 
* హైప‌ర్‌టెన్ష‌న్‌, డ‌యాబెటిస్‌, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు లేని వాళ్లు రోజులో క‌నీసం రెండు వేల కేల‌రీలు అందేలా చూసుకోవాలి.


Also Read: FolicAcid: ప్రతి రోజూ ఫోలిక్ యాసిడ్ అందే ఫుడ్ తింటున్నారా? గర్బిణులు మరీ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి? లేదంటే...


కరోనా సెకండ్ వేవ్‌లో అధికంగా కనిపిస్తున్న లక్షణాల్లో (Corona second wave symptoms) జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించేవే ఎక్కువగా ఉన్నాయి. కరోనా తర్వాత జీర్ణ వ్యవస్థ సాధారణ స్థాయికి రావడానికి సమయం పడుతున్నందున తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.


శరీరానికి వ్యాయమం ఎప్పుడూ అవసరమే. అలాగే కరోనా రికవరి తర్వాత కూడా వ్యాయమం కొనసాగించాలి. అయితే మరీ ఎక్కువగా అలసిపోయే ఎక్సర్‌సైజుల (Exercises after COVID-19 recovery) జోలికి వెళ్లకపోవడమే మంచిది. శరీరానికి తగినంత నిద్ర (Sleeping), విశ్రాంతి అవసరం. లేదంటే త్వరగా అలసిపోయే ప్రమాదం ఉంది. ఎప్పటిలాగే మాస్కు ధరించడం (Wearing mask), సోషల్ డిస్టన్సింగ్ పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను శానిటైజ్ చేయడం తప్పనిసరి అలవాట్లుగా మార్చుకోవాలి.


Also Read: Child Health: మీ పిల్లలు నులి పురుగుల సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తూ... సమస్యకు దూరం అవ్వండి