దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని కొందరు.. సమ్మర్ కి వస్తుందని మరికొందరు అంటున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 


Also Read : ''నేను చాలా బిజీ.. రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో పెద్దగా పట్టించుకోలేదు''


ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే మహేష్ బాబుతో సినిమా తీస్తానని క్లారిటీగా చెప్పారు రాజమౌళి. అయితే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కి, మహేష్ బాబు సినిమాకి మధ్యలో రాజమౌళి మరో సినిమా చేస్తున్నాడనేది లేటెస్ట్ సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


దీనితరువాత కాస్త గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేయనున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా 2022 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతుంది. అంటే ఎలా లేదన్నా.. రాజమౌళికి డేట్స్ ఇవ్వడానికి మహేష్ కి ఏడెనిమిది నెలలు ఈజీగా పడుతుంది. అందుకే ఈ గ్యాప్ ని వాడుకోవాలనుకుంటున్నారు రాజమౌళి. అతి తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్ లో ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలనేది రాజమౌళి ఆలోచన. 


మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాను పూర్తిగా బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందించనున్నాడట. కేవలం ఒకట్రెండు నెలల్లో సినిమాను పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఓ నెల రోజులు గట్టిగా ప్రమోషన్స్ చేసి సినిమాను విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తారా..? లేక దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. గతంలో రాజమౌళి ఇలానే తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేశారు. ఇప్పుడు అలానే బాలీవుడ్ లో ప్రయోగం చేయాలనుకుంటున్నారు. 


Also Read : అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్


Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు