పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగా చార్జ్‌షీట్‌లో ఆమెని చేర్చారు పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పాశెట్టి చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ''నేను షూటింగ్స్ లో చాలా బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. హాట్ షాట్స్, బాలీఫేమ్ యాప్స్ గురించి కూడా నాకు తెలియదు'' అంటూ శిల్పాశెట్టి చెప్పిన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. 


Also Read : అపోలో హాస్పిటల్‌కు బన్నీ.. సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్


ఈ కేసులో మొత్తం 1400 పేజీల చార్జ్‌షీట్‌ ను పోలీసులు ఫైల్ చేశారు. పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రా వ్యవహారం బయటపడగానే.. హాట్ షాట్స్ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించారు. ఆ తరువాత బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది. ఈ మొత్తం పోర్న్ రాకెట్ ను గుట్టుచప్పుడు కాకుండా నడిపించినరాజ్‌కుంద్రా దీనికోసం వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశరాలను వాడుకున్నట్లు చార్జ్‌షీట్‌లో నమోదు చేశారు అధికారులు. 


ఈ ఏడాది జులై 19 నుంచి రాజ్‌కుంద్రా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. వీరి బెయి పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. భర్త అరెస్ట్ తరువాత శిల్పాశెట్టి బయట పెద్దగా కనిపించలేదు. షూటింగ్ లకు కూడా వెళ్లడం మానేసింది. ఇప్పుడిప్పుడే ఆమె బయటకొచ్చి కొన్ని ఈవెంట్స్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా ఇద్దరు పిల్లలతో కలిసి గణపతి వేడుకలను జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  


Also Read: పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత.. ట్రోల్ చేస్తున్న నెటిజనులు