సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో నష్కల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న.. పలు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. 

 


 

'దేవుడు ఉన్నాడు' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేయగా.. పాపకు న్యాయం జరిగిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందించారు. 

 

''అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి'' అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. 

 

సోషల్ మీడియాలో #RIP Chaitra #JUSTICE SERVED అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.