తెలంగాణలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్ పరీక్షలో 68.84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 39,805 మంది దరఖాస్తు చేసుకోగా..  29,629 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,398 మంది క్వాలిఫై అయినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి వెల్లడించారు. ఎల్‌ఎల్‌బీ 3 ఏళ్ల కోర్సులో చంచలగూడకు చెందిన గణేష్‌ శాస్త్ర శరణ్‌, 5 ఏళ్ల కోర్సులో మల్కాజ్ గిరికి చెందిన డి.శ్రీధర్‌రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఎల్‌ఎల్‌ఎం (పీజీఎల్‌ సెట్‌) పరీక్షలో హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన బి.దీక్ష మొదటి ర్యాంకు సాధించింది. ఈసారి బీటెక్‌, ఎంబీబీఎస్‌ పూర్తయిన వారు కూడా లాసెట్‌ పరీక్ష రాశారని అధికారులు తెలిపారు. 


ఐదేళ్ల న్యాయ విద్య (బీఏ, బీకాం, బీబీఏ, ఎల్‌ఎల్‌బీ) కోసం 7,644 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 66.39 శాతం (5,793) మంది పరీక్షకు హాజరయ్యారు. పీజీ ఎల్‌సెట్‌ పరీక్షకు 3,284 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,676 మంది ప్రవేశ పరీక్షకు హాజరు కాగా.. 2,535 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణతా శాతం 94.73గా ఉంది. పీజీఎల్‌ సెట్‌ పరీక్ష కోసం 39,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,629 మంది పరీక్షకు హాజరవ్వగా.. 20,398 మంది క్వాలిఫై అయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.84గా ఉంది. 


టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండిలా.. 



  • టీఎస్ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ lawcet.tsche.ac.inను ఓపెన్ చేయండి. 

  • డౌన్‌లోడ్ ర్యాంకు కార్డు అని ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. 

  • మీ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి.. వ్యూ ర్యాంకు కార్డు ఆప్షన్ ఎంచుకోండి. 

  • కంప్యూటర్ స్క్రీన్ మీద మీ ర్యాంకు కార్డు కనిపిస్తుంది.

  • భవిష్యత్ అవసరాల కోసం ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.  


Also Read: Ganesh Immersion 2021: హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్... ఈ ఏడాదికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు


Also Read: AP PGCET 2021: ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?


Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?