బిగ్ బాస్ సీజన్ 5 మొదలై పది రోజులకు పైనే అయింది. మొదటివారం సరయు ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో నామినేషన్లో ఏడుగురు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతోంది. ఇది ఫిజికల్ టాస్క్ కావడంతో హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు పడిపోతూ.. కొట్టుకుంటూ హింసకు పాల్పడ్డారు. బిగ్ బాస్ ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా.. హౌస్ మేట్స్ మాత్రం తగ్గలేదు. 

 


 

రెండు రోజులుగా హౌస్ లో గొడవలు మాత్రమే జరుగుతుండడంతో బిగ్ బాస్ కి కూడా విసుగొచ్చిందో ఏమో గానీ ఈరోజు ఎపిసోడ్ ని కాస్త ఫన్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో  ముందుగా లోబో, ప్రియాంక కలిసి నవ్వించడానికి ప్రయత్నించారు. ఇద్దరూ కలిసి ఆటో టాస్క్ చేశారు. 

 

ఆ తరువాత ఉమాదేవి, సిరి కలిసి అత్తాకోడళ్లుగా ఓ టాస్క్ చేశారు. సిరిని పొగిడేస్తూ.. తన కొడుకుగా షణ్ముఖ్ పేరు చెబుతూ రచ్చ చేసింది ఉమాదేవి. అత్తాకోడళ్లు ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ సాగిన ఈ టాస్క్ చూసి హౌస్ మేట్స్ బాగా నవ్వుకున్నారు. అనంతరం హౌస్ మేట్స్ అందరూ కలిసి 'సీటీమార్ సీటీమార్ సీటీమార్' అంటూ సాగే మాస్ మసాలా సాంగ్ కు స్టెప్పులేస్తూ అలరించారు.