దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా ఛండీగఢ్​, ఆంధ్రప్రదేశ్, కేరళలో తొలి కేసులు నమోదు కాగా కర్ణాటకలో మూడో కేసు నిర్ధారణైంది. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది.


కర్ణాటకలో మూడు..


కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఈ రోజు మూడో కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్​గా నిర్ధారణైనట్లు కర్ణాటక వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం బాధితుడు ఐసోలేషన్​లో ఉన్నట్లు పేర్కొంది. బాధితుడికి దగ్గరగా తిరిగిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఐదు ప్రైమరీ, 15 సెకండరీ కాంటాక్టులను గుర్తించినట్లు వైద్యశాఖ తెలిపింది. వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.


ఛండీగఢ్‌లో తొలి కేసు..


ఛండీగఢ్​లో 20 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడు ఇటలీ నివాసి -అని అధికారులు తెలిపారు. భారత్​లో ఉన్న బంధువులను చూసేందుకు ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. యువకుడు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని, ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారని వివరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు..


ఆంధ్రప్రదేశ్​లోనూ ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడు గత నెల 27న ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా వైజాగ్ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధరణ అయింది.


విదేశాల నుంచి వచ్చిన 15 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్​కు పంపగా10 మంది ఫలితాలు వచ్చాయి. అందులో ఒకరికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని ఏపీ వైద్య శాఖ తెలిపింది.


కేరళలో కూడా తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. యూకే నుంచి కొచ్చి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణైంది.


Also Read: US Tornado: టోర్నడో ధాటికి అమెరికా కకావికలం.. 80 మంది వరకు మృతి


Also Read: Viral Video India 2021: 'ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. దుమ్మురేపారు కదరా'.. ఈ ఏడాది ఇవే తోపు వీడియోలు!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,774 మందికి కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి


Also Read: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి


Also Read:  విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే


Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!


Also Read: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి