Health Issues and Daily Intake Guidelines of Nuts : జీడిపప్పు, బాదం, వాల్​నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్​లో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలోని హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వీటిని చాలామంది తమ రెగ్యూలర్​ డైట్​లో తీసుకుంటారు. హెల్తీ స్నాక్​గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీటి రుచి కూడా బాగుంటుంది కాబట్టి కొందరు ఎక్కువగా తినేస్తారు. ఇలా మోతాదుకు మించి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. 


నట్స్​ని మోడరేట్​గా తీసుకుంటే శరీరానికి హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బరువు తగ్గడానికి, హార్ట్​ని హెల్తీగా ఉంచుకోవడంలో, హెల్తీగట్​ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ నట్స్​ని రోజుకు ఎన్ని తినాలి? ఎలా తీసుకుంటే మంచిది? తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


బరువు పెరిగిపోతారట


నట్స్​లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గేవారికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగేలా చేస్తాయి. వీటిలోని క్యాలరీలు బరువును పెంచుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని లిమిట్​గా తీసుకోవాలి. 


కిడ్నీ సమస్యలు


నట్స్​ని రెగ్యూలర్​గా లిమిట్​గా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వీటిలోని ఫైబర్ గట్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. వీటిని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయోరియా వంటి సమస్యలు వస్తాయి. బాదం, జీడిపప్పు వంటి వాటిలో ఆక్సాలేట్స్, ఫైటటేస్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశముంది. 


కొలెస్ట్రాల్, గుండె సమస్యలు.. 


గుండెను హెల్తీగా ఉంచుకునేందుకు నట్స్ తినమని వైద్యులు కూడా చెప్తారు. ముఖ్యంగా వాల్​నట్స్​లోని ఒమేగా ఫ్యాటీ 3 గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మేలు చేస్తుంది. కానీ ఈ నట్స్​ని ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు తప్పవు అంటున్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇవి గుండె దగ్గరు బరువును, ఇబ్బందిని కలిగిస్తాయి. దీనివల్ల గుండెపై చెడు ప్రభావముంటుంది. నట్స్ ఎక్కువగా తింటె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. 



ఆరోగ్య ప్రయోజనాల కోసం.. 


మీరు హెల్త్ బెనిఫిట్స్ కోసం.. రోజుకు 28 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే మీ బరువు, ఆరోగ్య సమస్యలను బట్టి వీటి క్వాంటిటీ మారుతూ ఉంటుంది. కచ్చితంగా వీటిని తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి. అలాగే వీటిని నేరుగా కాకుండా రాత్రుళ్లు నానబెట్టి ఉదయాన్నే తింటే మంచి ఫలితాలుంటాయి. 


Also Read : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.