Mass Spectrometry test to identify the type 2 Diabetes chances in kids : ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న వ్యాధి.. టైప్‌-2 మధుమేహం. చిన్న వయస్సులోనే పిల్లలను చుట్టుముట్టి వారి ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారిని.. ముందుగానే పసిగట్టే శాస్త్రసాంకేతికతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి చిన్నారులు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో ఆ పిల్లలు టైప్‌-2 మధుమేహం బారిన పడతారో లేదో తేల్చే మాస్ స్పెక్ట్రోమెట్రీ పరీక్షల విధానాన్ని లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది అప్పుడే పుట్టిన శిషువులు పెరిగి పెద్దయ్యాక మధుమేహం బారినపడే అవకాశం ఉందా లేదా  అన్న గుట్టు కూడా లిపిడ్స్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలో తేటతెల్లం అవుతుందని నేచర్‌ మెడిసన్ కథనం తెలిపింది.


లిపిడ్స్ అంటే ఏంటి..?  వాటి ఆధారంగా టైప్‌-2 మధుమేహం గుట్టు ఎలా తెలుసుకోవచ్చు:


            లిపిడ్స్ ఆధారంగా భవిష్యత్‌లో ఏ చిన్నారి.. ఒబేసిటీ సమస్యలైన టైప్‌-2 మధుమేహం సహా లివర్‌, హార్ట్ డిసీజెస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చే కొత్త టెస్టుల విధానాన్ని లండన్ శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు. శరీలంలో ఉండే లిపిడ్స్‌కు వాటి డిసార్డర్స్ కారణంగా చిన్నారుల్లో మెటబాలిజం దెబ్బతినే అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని లండన్లోని కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు కనిపెట్టినట్లు నేచర్ మెడిసన్ పేర్కొంది. ఈ ఫైండింగ్ ద్వారా మధుమేహం బారినపడే అవకాశం ఉన్న చిన్నారులకు.. ఇప్పటికే అందుబాటులో ఉన్ బ్లడ్‌ ప్లాస్మా టెస్టింగ్ టెక్నాలజీ సాయంతో ముందస్తుగానే సరైన చికిత్స అందించడానికి అవకాశం ఏర్పడుతుందని నేచర్ మెడిసీన్  అభిప్రాయపడింది.






లిపిడ్స్ : లిపిడ్స్ అంటే మానవ శరీరంలో ఉండే ఫ్యాటీ కాంపౌండ్స్‌ లేదా ఫ్యాటీ యాసిడ్స్‌. అవి శరీరంలో కొన్ని నిర్దిష్టమైన ప్రక్రియలు చేపట్టడానికి నిర్దేశించినవి. ఇవి శరీరంలోని సెల్ మెంబ్రేన్సర్‌లో ఒక భాగంలా ఉండి.. వాటిలోకి ఏ పదార్థం వెళ్లాలో వద్దో చూసే గేట్ కీపర్స్‌లా పనిచేస్తుంటాయి. ఈ లిపిడ్స్ మన శరీరంలో శక్తిని స్టోర్ చేయడానికి, అవసరమైన చోటకి పంపిణీ చేయడానికి, విటమిన్స్‌ను అబ్సార్బ్ చేసుకోవడం సహా హార్మోన్స్ తయారీ శరీరంలో మిలియన్ల కొద్దీ ఉన్న లిపిడ్స్ పని. ఐతే.. ఈ లిపిడ్స్ అవసరానికి మించి ఉన్నప్పుడే శరీరం వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


            ఇప్పటివరకూ పిల్లల్లో ఒబేసిటీకి కొలెస్ట్రాల్ కారణంగా అధ్యయనాలు చెబుతూ ఉండగా.. లండన్ శాస్త్రవేత్తలు కనుక్కొన్న విషయాలు.. దీన్ని వ్యతిరేకిస్తోంది. పిల్లల బరువుతో సంబంధం లేకుండా చిన్నారుల్లో బ్లడ్‌ ప్రెజర్ వంటి ప్రమాదరమైన రోగాలకు పిల్లల శరీరంలోని కొత్త లిపిడ్స్ కారణంగా వస్తున్నట్లు కొత్త అధ్యయనంలో తేల్చారు. అంతేకాకుండా శరీరంలో వివిధ విధులు నిర్వర్తించే లిపిడ్స్‌లో హానికరమైనవి గుర్తించడానికి కెమిస్ట్రీ సాయంతో అభివృద్ధి చేసిన మాస్‌ స్పెక్ట్రోమెట్రీ అనే అధునాత పరీక్షా విధానం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


హోల్‌బెక్ మోడల్‌లో వందలాది చిన్నారులపై పరీక్షలు:


            హోల్‌బెక్ మోడల్ అన్నది ఒబెసిటీతో బాధపడే చిన్నారులను ట్రీట్‌ చేయడానికి డెన్మార్క్ వైద్యులు అభివృద్ధి చేసిన నూతన వైద్య విధానం. ఇందులో చిన్నారుల్లో ఒబేసిటీ పట్ల ఉండే సిగ్గు బిడియం వంటివి పోగొట్డడం సహా వారి ఆరోగ్యాన్ని పెంపొందించడం ముఖ్య భాగాలుగా ఉంటాయి. ఈ విధానంలో 2 వందల మంది చిన్నారులకు లండన్ వైద్యులు మాస్‌ స్పెక్ట్రో మెట్రీ పరీక్షలు నిర్వహించారు. మొదట ఒబేసిటితో బాధపడుతున్న 13 వందల మంది


చిన్నారుల బ్లడ్ సాంపిల్స్ తీసుకొని లిపిడ్స్ ప్రొఫైలింగ్ చేశారు. ఆ తర్వాత వారిలో 200 మందిని హొల్‌బేక్ విధానంలో ఏడాది పాటు పర్యవేక్షణలో ఉంచారు. వారిలో చాలా మందిలో బ్లడ్ ప్రెజర్, ఇన్సులిన్ మార్పులు సహా ఇతర BMIలలో మార్పులకు కారణం అవుతున్న లిపిడ్స్ కంట్రోల్‌లోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకూ లిపిడ్స్ ప్రొఫైల్ టెస్టు ద్వారా మంచి చెడు లిపిడ్స్ ను మాత్రమే గుర్తిస్తూ వచ్చారని.. ఇప్పుడు భవిష్యత్‌లో డయాబెటిస్‌కు కారణమయ్యే లిపిడ్స్‌ను కూడా ముందస్తుగానే ఒక చిన్న బ్లడ్ టెస్టు ద్వారా గుర్తించగలుగుతున్నామని పరిశోధనలో భాగమైన కింగ్స్‌ కాలెజ్‌ లండన్ శాస్త్రవేత్త క్రిస్టినా తెలిపారు. ఇది డయాబెటిస్‌ టైప్‌-2ను ఎదుర్కోవడంలో తల్లిదండ్రులకు, వైద్యులకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆమె వివరించారు. ఇప్పటి వరకూ లివర్ డిసీజ్‌కు ఒబేసిటీ ఓ కారణంగా భావిస్తూ వస్తున్న వైద్యులు.. ఇక మీదట ఈ కొత్త దృక్పథం ద్వారా ముందస్తుగానే చిన్నారులు ఆ వ్యాధి బారిన పడకుండా అరికట్టగల అవకాశం ఏర్పడుతుందని నేచర్ మెడిసిన్ పేర్కొంది.
Also Read: Lipid Profile Test : లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్​తో గుండె ఆరోగ్యం తెలిసిపోతుందా?


            ఇప్పుడు భవిష్యత్‌పై దృష్టి పెట్టిన శాస్త్రవేత్తలు.. ఆ లిపిడ్స్ ఇలా వ్యవహరించడానికి మూల కారణాలు అన్వేషించడాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఏ జెనెటిక్స్ లిపిడ్స్‌ను ప్రభావితం చేసి బాడీ మెటబాలిజాన్ని దెబ్బతీస్తున్నాయో కనుక్కోగలిగితే.. దానికి పరిష్కార మార్గం సులువు అవుతుందని.. ఆ దిశగా తమ పరిశోధన మొదలైందని వివరించారు.