ప్రస్తుతం ఎంతో మంది తల్లిదండ్రులు తమ చిన్నారుల కోసం డైపర్లు వాడుతున్నారు. డైపర్లు వాడటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు చూసుకుంటూ డైపర్లు మార్చకపోతే పాపాయికి రాష్ వచ్చేస్తుంది. దద్దుర్లు ఏర్పడతాయి. అత్యవసరం అయితే తప్ప డైపర్లు ఎక్కువగా వాడొద్దని అంటున్నారు వైద్యులు.
చిన్న పిల్లల్లో డైపర్ రాష్ సమస్య చాలా కాలం ఉంటే పట్టించుకోకుండా వదిలేయకండి. దీర్ఘకాలంలో ఇది వివిధ రకాల జబ్బులకు దారి తీస్తోంది. క్యాన్సర్, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ బ్యాలెన్స్, వ్యాధి నిరోధక శక్తి లోపించడం, అలర్జీ తదితర సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
Also Read: ఈ కాంబినేషన్ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది
* డైపర్స్ ఉపయోగించేటప్పుడు పిల్లలో ఎక్కువగా గమనించే లక్షణం డైపర్స్ వల్ల బేబీ స్కిన్ ఎర్రగా మారుతుంది. ఇలా ఎర్రగా మారిన తర్వాత దురద, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి.
* డైపర్స్‌లో ఉండే వాలిటిలై ఆర్గానిక్ కాంపౌడ్స్ బేబీ యొక్క ఇమ్యూనిటి మీద ప్రభావం చూపుతుంది. తరచూ వ్యాధి నిరోధక శక్తి లోపించడం వల్ల ఇన్ఫెక్షన్స్, డైపర్ వేసిన భాగంలో చర్మం వాపు కలుగుతుంది. పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్స్‌కు గురి అవుతుంటే డైపర్స్‌ను గమనించాలి. ఎలాంటి బ్రాండ్ డైపర్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయో గుర్తించి వాటిని వెంటనే మార్చాలి.
* కాటన్ క్లాత్ డైపర్స్‌ను ఉపయోగించేటప్పుడు... తడి అయిన ప్రతి సారి డైపర్స్‌ను మార్చాల్సి ఉంటుంది . అయితే డిస్ఫోసబుల్ డైపర్స్ ఎక్కువ సమయం అలాగే ఉంచేయడం వల్ల చిన్నారులు యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అనటోమికల్ పెక్యూలియారిటీ వల్ల ఇది ఆడ పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది.
రాష్ తగ్గడానికి హోం రెమిడీ:
వెనిగర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్. కాబట్టి డైపర్ రాషెస్‌ను నియంత్రించడానికి ఇది బాగా పని చేస్తుంది. ఒక కప్పు వాటర్‌లో ఒక టీ స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయాలి. డైపర్ మార్చిన ప్రతి సారి ఈ నీళ్లతో అక్కడ శుభ్రంగా తుడవాలి. ఇలా చేస్తే రాష్ రాకుండా ఉంటుంది.
Also Read: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.