రోజువారి కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 37 వేల కేసులు నమోదయ్యాయి. 369 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే వరుసుగా రెండు రోజులపాటు కేసులు 40 వేల లోపే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం.







  1. మొత్తం కేసులు: 3,30,96,718

  2. యాక్టివ్ కేసులు: 3,91,256

  3. మొత్తం రికవరీలు: 3,22,64,051

  4. మొత్తం మరణాలు: 4,41,411

  5. మొత్తం వ్యాక్సినేషన్: 70,75,43,018 


మంగళవారం మొత్తం 17,53,745 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 53,49,43,093కి చేరింది.



  • రోజువారీ పాజిటివిటీ రేటు 2.16 శాతంగా ఉంది. గత 9 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువే ఉంది.

  • వీక్లీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది. గత 75 రోజులుగా ఇది 3 శాతం లోపే ఉండటం ఊరట కలిగిస్తోంది.

  • మరణాల రేటు 1.33 శాతంగా ఉంది.


దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 70.75 కోట్లు వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


2020 ఆగస్టు 7న దేశంలో కరోనా కేసులు 20 లక్షల మార్కు దాటాయి. 2020 ఆగస్టు 23కి 30 లక్షలు చేరాయి. 2020 సెప్టెంబర్ 5కి 40 లక్షలు దాటాయి. 2020 సెప్టెంబర్ 16కి కరోనా కేసులు 50 లక్షల మార్కుకు చేరగా 2020 సెప్టెంబర్ 28కి 60 లక్షలు దాటాయి. 2020 అక్టోబర్ 11కు 70 లక్షలు చేరగా 2020 డిసెంబర్ 19కి కోటి మార్కును దాటాయి.


ప్రస్తుతం 2021 జూన్ 23కి మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు కోట్లు దాటింది.


Also Read: Red Rice Benefits: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం