దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదుకాగా 144 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో 19,788 మంది కరోనా నుంచి రికవరయ్యారు. రికవరీ రేటు 98.1కి చేరింది. గతేడాది మార్చి తర్వాత ఇదే అత్యధిక రికవరీ రేటు.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,95,846కి చేరింది. గత 220 రోజుల్లో ఇదే అత్యల్పం.
- మొత్తం కేసులు: 3,40,67,719
- యాక్టివ్ కేసులు: 1,95,846
- మొత్తం రికవరీలు: 3,34,19,749
- మొత్తం మరణాలు: 4,52,124
- మొత్తం వ్యాక్సినేషన్: 97,65,89,540 (గత 24 గంటల్లో 41,20,772)
వ్యాక్సినేషన్..
ఇప్పటివరకు రాష్ట్రాలు, యూటీలకు 101.7 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 18 మంది మృతి
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య