సూర్య తమిళ హీరో అయినా తెలుగు అభిమానులు కూడా ఎక్కువే. ఆయన సినిమాలు వదలకుండా చూసేస్తారు మనవాళ్లు. త్వరలో ‘జై భీమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య. అతని 40వ సినిమా ఇది. ఇందులో లాయర్ గా కనిపించబోతున్నాడు. ఆ సినిమా తాలూకు టీజర్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే సూర్య పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఓ నిజజీవిత ఘటన ఆధారంగా నిర్మిస్తున్నట్టు సమాచారం.
1993లో తమిళనాడులో ఓ గిరిజన యువతికి జరిగిన అన్యాయంపై ఓ లాయర్ పోరాటం చేశారు. అదే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్. టీజర్ ను చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. ఈ టీజర్ లో మహిళపై పోలీసులు దాడి చేయడం, అమాయకులని వేధించడం కనిపిస్తుంది. ఆ గిరిజన మహిళకు సూర్య అండగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ సందర్భంగా ఆయన వేసిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది ‘దొంగలకు ఒక జాతి ఉంటుందా? మీ జాతిలోనూ, నా జాతిలోనూ, అన్ని జాతుల్లోనూ పెద్ద పెద్ద దొంగలున్నారు’ అంటూ గిరిజన జాతికి అండగా ఉండే లాయర్ గా సూర్య కనిపించారు. అలాగే ‘ఏ ఆధారాలు లేకుండా మనం కేసు వేసింది... ముగ్గురు పోలీసులకు వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వాన్ని ఎదిరించి..’ అని బాధిత మహిళతో చెబుతున్న డైలాగ్ కూడా పవర్ ఫుల్ గా ఉంది.
ఈ సినిమాకు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ఓ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఆ పాత్ర పాజిటివ్ లేదా నెగిటివ్ షేడ్స్ ఉన్నదా తెలియరాలేదు. అయితే ఆయన పోలీస్ కనిపించబోతున్నారు. ఇక రావు రమేష్ లాయర్ పాత్రను పోషిస్తున్నారు. 2 డీ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో మలయాళ నటి రజిషా విజయన్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని దీపావళి సందర్భంగా నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ నిర్మాతలు ఎవరో కాదు జ్యోతిక, సూర్యా దంపతులే.
Also read: దసరా వేడుకలో పెద్దమ్మతల్లిని దర్శించుకున్న శ్రీముఖి
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు