ఐఐటీలో ఉద్యోగాల కోసం నిరీక్షించే వారికి శుభవార్త. కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ 95 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ సూపరింటెండెంట్ సహా పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు నవంబర్ 16వ తేదీ వరకు ఉంది. ఐఐటీ కాన్పూర్‌ అధికారిక వెబ్‌సైట్ iitk.ac.in ని సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు సెమినార్ ప్ర‌జంటేష‌న్, స్కిల్ టెస్టు ఉంటుంది. ఈ రౌండ్‌ల‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.21,700 నుంచి రూ.2,09,200 వరకు ఉంటుంది. 

Also Read: ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రైనీ జాబ్స్.. బీటెక్ వారికి మంచి ఛాన్స్.. 

విద్యార్హత, వయోపరిమితి.. 
పోస్టును బట్టి విద్యార్హత మారుతోంది. జూనియ‌ర్ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం కూడా అవసరం. జూనియ‌ర్ సూప‌రింటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే వారు సైన్స్‌లో మాస్ట‌ర్ డిగ్రీతో పాటు 5 ఏళ్ల పని అనుభ‌వం తప్పనిసరి లేదా గ్రాడ్యుయేష‌న్ విద్యార్హతతో 7 ఏళ్ల పని అనుభ‌వం ఉండాలి. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీల్లో 55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు 55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ప‌ని అనుభ‌వం తప్పనిసరి. పోస్టును బట్టి 21 ఏళ్ల నుంచి 51 ఏళ్ల మ‌ధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: ఏపీలో 1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్.. 40 కోర్సుల్లో సర్టిఫికేషన్..

విభాగాల వారీగా ఖాళీలు.. 

పోస్టు  ఖాళీల సంఖ్య 
డిప్యూటీ రిజిస్ట్రార్  3 
అసిస్టెంట్ రిజిస్ట్రార్ 8
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (సెంట్ర‌ల్ లైబ్రరీ) 1
హిందీ ఆఫీసర్
జూనియ‌ర్ సూప‌రింటెండెంట్ 14 
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ 12 
జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌, ట్రాన్స్‌లేష‌న్‌
జూనియ‌ర్ సూప‌రింటెండెంట్ (నానో సైన్స్‌)
జూనియర్ టెక్నీషియన్ 17  
జూనియ‌ర్ అసిస్టెంట్‌  31
ఫిజిక‌ల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్
డ్రైవర్ గ్రేడ్ II

ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
* ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్‌సైట్ iitk.ac.inని ఓపెన్ చేయండి.
* రిక్రూట్‌మెంట్ పోర్టల్‌ను ఎంచుకోండి. 
* అభ్యర్థులు ముందుగా తమ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ అవ్వాలి. 
* ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి.
* దరఖాస్తు ఫారమ్ నింపిన తర్వాత, అభ్యర్థులు పోస్టును బట్టి రూ .250 లేదా రూ .500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మ‌హిళలు, దివ్యాంగ అభ్య‌ర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 
* ద‌ర‌ఖాస్తు పూర్త‌య్యాక అప్లికేష‌న్ ప్రింట్ తీసుకోవాలి. దీనిని ఈ కింది చిరునామాకు పోస్టు చేయాలి. 
Recruitment Section Room no. 224
Faculty Building 2nd Floor
IIT Kanpur (UP) -208016

Also Read: టెన్త్ అర్హతతో 3,261 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.85,500 వరకు వేతనం.. త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

Also Read: ఇంటర్ విద్యార్హతతో FSSAIలో 254 ఉద్యోగాలు.. రూ.1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి