కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ మరో మైలు రాయికి దగ్గర్లో ఉంది. కరోనా వైరస్ టీకాల పంపిణీలో అత్యంత వేగంగా 95 కోట్ల వ్యాక్సిన్ పంపిణీలను పూర్తి చేసుకున్న భారత్ 100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ జనవరి 16 నుంచి మొదలైంది. మొదటి విడతగా ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు అందించారు. తర్వాత మార్చి 1 నుంచి 60 ఏళ్ల వయోజనులకు అనంతరం ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
దేశంలో కేసులు..
కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 20 వేలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,166 కొత్త కేసులు నమోదుకాగా 214 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,30,971కి పెరిగింది. గత 2016 రోజుల్లో ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- యాక్టివ్ కేసులు: 2,30,971
- మొత్తం రికవరీలు: 3,32,71,915
- మొత్తం మరణాలు: 4,50,589
- మొత్తం వ్యాక్సినేషన్: 94,70,10,175
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.71%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 97.96%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం. గత 24 గంటల్లో 24,963 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 2,486 కొత్త కేసులు నమోదయ్యాయి 59 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,75,578కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,39,470కి పెరిగింది.
Also Read:Kisan Naya rally: మోదీజీ.. ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఖాళీ లేదా?: ప్రియాంక