దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్ష కీ విడుదలైంది. కీపై అభ్యంతరాలు తెలిపేందుకు విద్యార్థులకు అవకాశం ఇచ్చింది. విద్యార్థులు రేపు (అక్టోబర్ 11) సాయంత్రం 5 గంటల వరకు కీపై అభ్యంతరాలు వెల్లడించవచ్చు. అభ్యంతరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్‌లు సైతం ఇటీవల విడుదల అయ్యాయి. పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ ఆధారంగా విద్యార్థులు తమ స్కోర్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా తమ ర్యాంక్‌ను సైతం అంచనా వేసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ (IITK) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు అక్టోబర్ 15వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: నేటితో ముగియనున్న నీట్ యూజీ సవరణలు.. ఇవి చేయడం మర్చిపోకండి..
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
1. జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.inను ఓపెన్ చేయండి.
2. హోం పేజీలో ఆన్సర్ కీ లింక్ మీద క్లిక్ చేయండి. ఇందులో డౌన్‌లోడ్ సెక్షన్ ఎంచుకోండి.
3. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు అందించాలి.
4. ఆన్సర్ కీ వివరాలు చూడటానికి అక్కడ ఉన్న డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
(ఆన్సర్ కీ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
స్కోర్ ఇలా అంచనా వేసుకోండి..
1. రెస్పాన్ షీట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత జవాబు కీతో సరిపోల్చుకోండి.
2. కరెక్టు జవాబుకి మార్కు వేసుకోండి.
3. తప్పు జవాబుకి నెగిటివ్ మార్కు వేసుకోండి.
4. ఈ రెండు ఫలితాలను సరిపోల్చుకుంటే పరీక్షలో వచ్చిన స్కోర్ లభిస్తుంది.
Also Read: కోవిడ్ బాధిత విద్యార్థులకు ఎస్‌బీఐ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.38,500 సాయం..
యూజీసీ నెట్ మళ్లీ వాయిదా..
యూజీసీ నెట్ (UGC NET) 2021 పరీక్షలు వాయిదా పడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు అక్టోబర్ 17వ తేదీ నుంచి మొదలు కావాల్సి ఉంది. డిసెంబర్ 2020, జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడగా.. తాజాగా మరోసారి వాయిదా పడింది. ఎన్టీఏ మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. ఈ తేదీల్లో ఇతర ముఖ్యమైన పరీక్షలు ఉండటంతో తేదీలను సవరించింది. అక్టోబర్ 17 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కోవిడ్ కారణంగా యూజీసీ నెట్ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది.
Read More: అభ్యర్థులకు అలర్ట్.. యూజీసీ నెట్ మళ్లీ వాయిదా.. త్వరలో కొత్త తేదీల ప్రకటన..
Also Read: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి