Avoid Mental Stress for Healthy Life : ఆరోగ్యం అంటే మీ దృష్టిలో శరీరాన్ని బాగా చూసుకోవడమేనా? అయితే మరి మీ మానసికి స్థితి పరిస్థితి ఏంటి? మీకు తెలుసా? శారీరకంగా వీక్ ఉన్నా సరే.. మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటే ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవచ్చు. కానీ మానసికంగా వీక్ ఉంటే.. శారీరకంగా ఎంత బలంగా ఉన్నా సరే మీరు ఏమి చేయలేరు. కాబట్టి మానసిక స్థితి గురించి ఇప్పటి నుంచైనా కేర్ తీసుకోవడం ప్రారంభించండి. కొన్ని శారీరక మార్పులు మానసిక ఒత్తిడి వల్లే కలుగుతాయి. మీలో కూడా ఇలాంటి మార్పులు ఉంటే వెంటనే మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి.
రోజువారీ జీవితంలో పలు కారణాల వల్ల మన మానసిక స్థితి దెబ్బతింటుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ ఇబ్బందిని చాలా మంది ఎదుర్కొంటారు. అయితే తీవ్రమైన ఒత్తిడి శరీరంపై కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మీరు మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల కలిగే లక్షణాలు ఏంటో.. వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక లక్షణాలు..
మానసిక ఒత్తిడిని వివిధ లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అయితే మానసిక, శారీరక లక్షణాలు ఎలా ఉంటాయంటే.. ఎక్కువగా భావోద్వేగాలకు గురవుతారు. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. భయము, లేదంటే ఏదో జరిగిపోతుందనే అభద్రత ఎక్కువగా ఉంటుంది. చిరాకు పెరుగుతుంది. మానసిక కల్లోలం.. కోపం చూపించలేకపోవడం కూడా దీనిలో భాగమే.
మానసిక ఒత్తిడిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిప్రెషన్ గురించే. డిప్రెషన్లో ఉండేవారు విచారంతో ఉంటారు. సంతోషించాల్సిన వాటిపై ఏ మాత్రం ఆసక్తి కనబరచలేరు. ఎప్పుడూ ఏదో కోల్పోయామనే భావన కనిపిస్తుంది. రోజూవారీ బాధ్యతలు నిర్వహించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఏకాగ్రత ఉండదు. ఏ పనిపై దృష్టి పెట్టలేకపోవడం.. మతిమరుపు.. నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బందులు దీనిలో భాగమే.
శారీరక లక్షణాలు..
ఇక శారీరక లక్షణాల జోలికి వస్తే.. తలనొప్పి తరచుగా వస్తుంటుంది. ముఖ్యంగా మైగ్రేన్ ఎటాక్ అవుతుంది. కండరాల్లో ఒత్తిడి పెరుగుతుంది. నొప్పులు ఎక్కువగా ఉంటాయి. స్ట్రెస్ వల్ల మీ శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయనేది నమ్మలేని నిజం. నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. కడుపు నొప్పి.. అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రక్తపోటు పెరుగుతుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. థైరాయిడ్ వంటి సమస్యలు స్ట్రెస్ వల్ల వస్తాయి.
ప్రవర్తనలో కూడా మార్పులుంటాయి..
మానసిక ఒత్తిడి ఎక్కువైతే.. ప్రవర్తనలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే.. అతిగా తింటారు లేదా అస్సలు తినరు. మద్యం లేదా పొగాకు వంటి అలవాట్లలో చిక్కుకుంటారు. స్నేహితులు, కుటుంబసభ్యుల నుంచి దూరంగా ఉంటారు. పనులు వాయిదా వేస్తారు.
ఇలాంటి లక్షణాలు మీలో గుర్తిస్తే వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించండి. ఒత్తిడి మనం ఎంత తగ్గించుకునేందుకు ప్రయత్నించినా సరే.. వైద్యుడి సలహాలు పాటిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా, త్వరగా చూడవచ్చు. మీకు దేనివల్ల ఒత్తిడి కలుగుతుందో గుర్తించి.. వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి. పనిలో పడి.. ఈ సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకండి.
Also Read : కడుపు ఉబ్బరంతో పాటు బరువును తగ్గించగలిగే టీ ఇదే
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*