Tea Recipe for Weight Loss : సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, సమాయానికి శరీరానికి అవసరమైన ఫుడ్ అందించకపోవడం వల్ల.. లేదంటే గ్యాస్​ను పెంచే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొందరిలో ఇది మలబద్ధకం (Constipation ) సమస్యను పెంచుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మీకోసం ఓ అద్భుతమైన టీ రెసీపీ ఉంది. ఇది మీ ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు.. బరువు తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఆ టీ ఏమిటి? దానిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో.. దానిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


సోంపు - అర టీస్పూన్


ధనియాలు -అర టీస్పూన్


అజ్వైన్ లీవ్స్ - 4


పుదీనా ఆకులు - 3


నీరు - ఒకటిన్నర కప్పు


తయారీ విధానం


ముందుగా స్టవ్ వెలిగించి.. దానిపై గిన్నె ఉంచండి. దానిలో నీరు పోసి.. సోంపు, ధనియాలు, అజ్వైన్ లీవ్స్, పుదీనా ఆకులు వేయండి. వాటిని 5 నిమిషాలు ఉడకనివ్వండి. నీరు సగం అయిన తర్వాత.. స్టౌవ్ ఆపేసి ఆ నీటిని వడకట్టండి. అంతే వేడి వేడి సోంపు టీ రెడీ అయిపోయింది. దీనిని వేడిగా ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. 


ముఖ్యంగా చలికాలంలో ఈ టీ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి. ఎందుకంటే శీతాకాలంలో వాతావరణంలో మార్పుల వల్ల జీర్ణక్రియ చాలా మందగిస్తుంది. దీనివల్ల.. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే సోంపుతో చేసిన ఈ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి.


భారీ భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ఆహారం జీర్ణమవ్వాలని సోంపు తింటారు. రెస్టారెంట్లలో కూడా వీటిని సర్వ్ చేస్తారు. అందుకే దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల కూడా మీరు ఈ సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. జీర్ణక్రియ మెరుగుపడి.. అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. మీ గట్ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా చాలామంది సోంపు తీసుకుంటారు. 


ఈ టీలో వినియోగించే ధనియాలు కూడా ఆరోగ్యానికి మంచివి. దీనిలో జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్​ ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలు కలిగి ఉంది. అంతేకాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సాహిస్తుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా ఈ టీ హ్యాపీగా సేవించవచ్చు. అజ్వైన్ ఆకులు కూడా కడుపు నొప్పులను తగ్గించి.. మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. మరి ఇంకేమి ఆలస్యం.. వెంటనే ఈ టీ తయారు చేసుకుని మీరు కూడా ఓ సిప్ వేసేయండి. 


Also Read : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.