మహారాష్ట్రలో ఐదు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలను కరోనా వైరస్ పూర్తి స్థాయిలో  విరవీహారం చేసింది. ఆ సమావేశాల్లో పాల్గొన్న వారు.. భాగం అయిన వారిలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. మూడు రోజుల కిందట ఇద్దరు మంత్రులు సహా యాభై మంది సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలగా.. తాజా ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పది మంది మంత్రులు కరోనా బారిన పడ్డారు. యాభై మందికిపైగా ఎమ్మెల్యేలకు వైరస్ సోకినట్లుగా గుర్తించారు. 


Also Read: దేశంలో ఆగని ఒమిక్రాన్‌ విజృంభణ.. భయపెడుతున్న మహారాష్ట్ర పరిస్థితులు
 
అసెంబ్లీ సమావేశాలను త్వరగా ముగించామని అయినా వైరస్ బారిన పడిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని మంత్రి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అభ్యర్థనతో కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూలను విధించాయి. మహారాష్ట్రలోనూ కొన్ని ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని మంత్రి అజిత్ పవార్ ప్రకటించారు.మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 8,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చితే ఈ సంఖ్య 50 శాతం అధికం. ఒక్క ముంబయి నగరంలోనే 5 వేల కేసులు బయటపడ్డాయి.  


Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి


కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతుతున్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ క్రమంలో లాక్ డౌన్ తరహా ఆంక్షళు విధఇంచే అవకాశం ఉందని అంచన ావేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అంత తీవ్రమైనది కాదని .. ఆస్పత్రి పాలయ్యే పరిస్థితి ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ఎలాంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.  ఏ మాత్రం నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకునే అసెంబ్లీ సమావేశాలే  హాట్ స్పాట్‌గా మారడంతో ఇక నుంచి ఎక్కడా సామూహిక కార్యక్రమాలకు చాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనలో  అక్కడి ప్రభుత్వం  ఉన్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి