దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 1500 మార్క్‌ దాటింది. ఈ కేసుల్లో మహారాష్ట్ర టాప్‌లో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో 24 గంటల్లో 454 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 


మరోసారి మహారాష్ట్రలో కేసులు సంఖ్య తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోని అత్యధికంగా ఆ రాష్ట్రంలో కేసులు బయటపడుతున్నాయి. 


దేశంలో గత 24 గంటల్లో 22,775 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 8,949 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 406 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఈ సంఖ్య  పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 


నార్మల్‌ కేసులతోపాటే కొత్త వేరియంట్‌ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటం మరింత భయపెడుతున్న అంశం. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1431 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
ప్రస్తుతం క్రియాశీల కరోనాకేసులు సంఖ్య 1,04,781 ఉంటే... రికవరీ రేటు 98.32% వద్ద ఉంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు ఇప్పుడు ఒక్కసారిగా పెరుగుతుండటం ఆందోళనకు కారణం అవుతోంది. 


మహారాష్ట్ర
దేశవ్యాప్తంగా వచ్చే కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. టెస్టులకు పంపించి  కేసుల్లో సగానికిపైగా కేసులు ఒమిక్రాన్‌వే కావడం భయపెడుతోంది. 24 గంటల క్రితం 282 శాంపిల్స్‌ను టెస్టులకు పంపిస్తే అందులో 55 శాతం ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్దారణైంది. 
282లో 156 మందికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. 89 మందికి డెల్టా డెరివేటివ్‌ ఉంటే... 37 మందికి డెల్టా వేరియంట్‌ ఉంది.


ఇప్పటి వరకు గుర్తించిన రోగుల్లో డెల్టా డెరివేటివ్ సోకిన ఒక సీనియర్ సిటిజన్ మరణించినట్లు BMCతెలిపింది. అతను డయాబెటిక్‌, బీపీతో బాధపడుతున్నాడు. COVID-19 వ్యాక్సిన్ సింగిల్ డోస్‌ మాత్రమే వేసుకున్నాడు. 


"ఈ ఓమిక్రాన్ రోగుల్లో ఎవరికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. అదనంగా, వారికి ఆక్సిజన్ లేదా ఐసియులో చేర్చాల్సిన అవసరం లేదు" అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 







కేసుల తీవ్ర ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ప్రభుత్వం. భారీ సంఖ్యలో మరణాలు కూడా ఉండొచ్చని అభిప్రాయపడింది. 


గుజరాత్
గుజరాత్‌లో శుక్రవారం 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఈ వేరియంట్ కేసుల సంఖ్య 113కి చేరుకుంది.


ఒమిక్రాన్ సోకిన పది మంది రోగులు త్వరగా కోలుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. 16 కొత్త కేసుల్లో అహ్మదాబాద్‌లో ఆరు, సూరత్, ఆనంద్‌లో మూడేసి, జునాగఢ్, అమ్రేలి, బరూచ్, బనస్కాంతలో ఒక్కొక్కటి నమోదయ్యాయి.


కొత్త వేరియంట్‌ సోకిన మొత్తం 113 మందిలో 54 మంది కోలుకున్నారు. 59 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. 


Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి! 
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి