కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నట్టు కేంద్రం మరోసారి ప్రకటించింది. ఒక్క డోసు తీసుకుంటే మరణాన్ని 96.6శాతం నివారించవచ్చని..  రెండు డోసులు తీసుకుంటే 97.5శాతం జయించవచ్చని పేర్కొంది. వ్యాక్సినేషన్ తర్వాత వ్యాధిబారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువని పేర్కొంది కేంద్రం. 
ఏప్రిల్‌ 18 నుంచి 15వరకు సేకరించిన డాటా ప్రకారం కేంద్రం కీలక అంశాలు వెల్లడించింది. వ్యాక్సిన్ పనితనం, వైరస్‌ వ్యాప్తి ఈ అంశాలపై ఐసీఎంఆర్‌ కీలక విశ్లేషణ చేసింది. ఈ వివరాలను ఏసీఎంఆర్ చీఫ్‌ బలరాం భార్గవ్ వెల్లడించారు. 


ఇప్పటి వరకు వ్యాక్సిన తీసుకున్న 18ఏళ్లపైబడిన వాళ్లకు ఇస్తున్న వ్యాక్సిన సమర్థవంతంగా పని చేస్తున్నట్టు ఐసీఎంఆర్ పేర్కొంది. అన్ని వయసుల వారిపై కూడా వ్యాక్సిన ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నట్టు తెలిపింది. సెకండ్‌ వేవ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకోనివారేనని లెక్కలతో వివరించింది ఐసీఎంఆర్. 


దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ 18ఏళ్లపైబడిన వారిలో 58శాతం మంది ఒకడోస్‌ తీసుకున్నారు. మొత్తంగా 72కోట్ల డోస్‌లు ఇప్పటి వరకు ఇచ్చారు. వందశాతం మందికి రెండు డోస్‌లు వ్యాక్సిన ఇస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌ వీకేపాల్ తెలిపారు. ఎప్పుడైనా కరోనా వైరస్‌ నుంచి పూర్తి రక్షణ కావాలంటే మాత్రం వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమన్నారు.  వ్యాక్సిన్‌ తీసుకుంటే మరణాల ముప్పు తప్పుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా బారిన పడే ఛాన్స్ చాలా తక్కువ ఉందన్నారు వీకే పాల్‌ . ఒకవేల వైరస్‌ సోకినా మరణం వరకు వెళ్లే ఛాన్సే లేదన్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా ఉండదన్నారాయన. 


వ్యాక్సినేషన్ పరిశీలిస్తే... సిక్కిం, దాద్రానగర్‌ హవేలీ, హిమాచల్‌ ప్రదేశ్‌లో 18ఏళ్లకుపై బడిన వారందరికీ మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తైందని కేంద్రం ప్రకటించింది. 


మేలో రోజుకు 20 లక్షల డోస్‌లు మాత్రమే వ్యాక్సినేషన్ అయ్యేదని.. సెప్టెంబర్‌ నాటికి ఆ సంఖ్యను 78 లక్షలకు పెంచామంటున్నారు కేంద్ర హోల్త్ సెక్రెటరీ రాజేశ్‌ భూషన్. 
దేశంలో ఇప్పటికి కూడా 35 జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతానికి పైగానే ఉందని మరో 30 జిల్లాల్లో ఐదు నుంచి పది శాతం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం. గతవారం కేసుల్లో 68-59శాతం కేసులు ఒక్క కేరళలోనే రిజిస్టర్‌ అయినట్టు పేర్కొంది. 


 


ALSO READ: పంజాబ్‌కు తమిళనాడు గవర్నర్ బదిలీ.. ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం


Horoscope Today : విఘ్నాలు తొలగించే వినాయకచవితి రోజు ఈ రాశులవారికి అంతా శుభమే..ఆ రెండు రాశులవారు మాత్రం వివాదాలకు దూరంగా ఉండండి