2021 సెప్టెంబరు 10 శుక్రవారం రాశిఫలాలు

మేషం

మేషరాశివారికి ఈరోజు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆరోగ్యం బావుంటుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. చట్టపరమైన విషయాలు పెండింగ్ లో ఉంటాయి. స్నేహితుల వైఖరి కారణంగా కొంత నష్టపోతారు. అనవసర ప్రసంగాలు ఇవ్వొద్దు. బంధువులతో వేభేదాలు ఉండే సూచనలున్నాయి.

వృషభం

కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశాలున్నాయి. వ్యాపార పర్యటన విజయవంతమవుతుంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. కుటుంబంలోని వృద్ధులు అనారోగ్యానికి కొంత ఖర్చవుతుంది. మీ గౌరవం పెరుగుతుంది. రావాల్సిన మొత్తం చేతికందుతుంది. 

మిథునం

మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. చేతిలో డబ్బులుంటాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. స్నేహితులు, బంధువులను కలుస్తారు. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ సంబంధిత సమాచారం తెలుస్తుంది. పెద్దల సలహాలు ఉపయోగపడతాయి.

Also read: వినాయక చవితి పూజ ఎలా చేయాలి.. అసలు మంత్రాలు ఏంటి?

కర్కాటక రాశి

మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. తొందరపాటు వద్దు. స్నేహితులు మీతోనే ఉంటారు. గాయాలపాలయ్యే అవకాశం ఉంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచితులతో అనవసర చర్చలు వద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

సింహం

ఈ రోజ పరధ్యానంగా ఉంటారు. చేయాలనకున్న పనుల్లో జాప్యం కారణంగా కొంత నష్టపోతారు. ఆందోళనలో ఉంటారు. అనవసర రిస్క్ తీసుకోవద్దు. లావాదేవీల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ప్రయాణాలు చేయవద్దు.

కన్య

కోపం, ఒత్తిడిని తగ్గించుకోండి. ప్రేమ వ్యవహారంలో అనుకూలత ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం బాగానే ఉంటుంది. అప్పుల నుంచి బయటపడతారు. బంధువులతో సామరస్యం ఉంటుంది. ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. పాత వ్యాధి తిరిగబెట్టే ప్రమాదం ఉంది.

Also Read: పార్వతీ దేవి తయారు చేసిన గణపయ్య నిజ రూపం చూశారా..గజముఖం పెట్టకముందు తొండం లేకుండా వినాయకుడు ఎలా ఉన్నాడో చూసి తరించండి..

తులారాశి

రాజకీయ వ్యక్తులతో చర్చలుంటాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శరీర నొప్పులతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

వృశ్చికరాశి

చాలా సానుకూలంగా ఉంటారు. కార్యాలయ వాతావరణం చక్కగా ఉంటుంది. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆనందం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ మాటపై సంయమనం పాటించండి. ఎవరితోనైనా వాదన ఉండవచ్చు. రిస్క్ తీసుకోకండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ధనుస్సు

ధనస్సు రాశివారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎలాంటి కారణం లేకుండా వివాదాలయ్యే సూచనలున్నాయి. విద్యార్థులకు మరింత కష్టపడాలి. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

Also Read: బిగ్ బాస్ 5 తెలుగు: ప్రియాకు షాకిచ్చిన హమీద.. ప్రియాంక ప్రేమలో లోబో.. కెప్టెన్‌గా సిరి!

మకరం

ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. అదృష్టం కలిసొస్తుంది. యువత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. పాత సమస్య నుంచి బయటపడతారు. ఆందోళన తొలగిపోతుంది.

కుంభం

ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. డబ్బు సంపాదించే మార్గాలు గోచరిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారం బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవడానికి వేనకాడకండి. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి. వృద్ధుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. సోదరుల నుంచి సహకారం అందుతుంది.

మీనం

ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితిని బలపడుతుంది. మీరు మీ పని మీద దృష్టి పెట్టండి. కుటుంబంలో ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. స్నేహితులను కలుస్తారు.

గమనిక:  ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…