విఘ్నాలు తొలగించి విజయం సిద్ధించేలా చేసే వినాయకుడికే అన్నింటా తొలి ప్రాధాన్యం. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడినే పూజిస్తాం. మరి వినాయక చవితి రోజు ఎంత ప్రత్యేకమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఊరూ-వాడ, చిన్నా పెద్దా అందరకీ సంబరమే. ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజు లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ ఏడాది వినాయకచవితి సెప్టెంబరు 10 శుక్రవారం వచ్చింది. ఆ పూజా విధానం ఇప్పుడు చూద్దాం.


పూజకు కావాల్సిన సామాగ్రి


పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు,  పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు, పాలవెల్లి.


ఎప్పటిలానే ముందుగా పసుపు వినాయకుడి దీప, ధూప, నైవేద్యాలు పూర్తిచేసి..ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన వినాయక విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి పూజించాలి..


పసుపు గణపతి పూజ


శ్లోకం:


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.


ఆచమనీయం


ఓం కేశవాయ స్వాహా,  ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా ,ఓం గోవిందాయ నమః ,ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః , ఓం త్రివిక్రమాయ నమః ,ఓం వామనాయ నమః , ఓం శ్రీధరాయ నమః , ఓం హ్రిషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః , ఓం దామోదరాయ నమః , ఓం సంకర్షణాయ నమః , ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః , ఓం అనిరుద్ధాయ నమః ,ఓం పురుషోత్తమాయ నమః , ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః.


గణపతికి నమస్కరించి


యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా తయోస్సంస్మరణాత్పుంసాంసర్వతో జయ మంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ: యేషామిందీవరశ్శ్హ్యామో హృదయస్థోజనార్థన: ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే.


ఈ మంత్రం చెపుతూ దేవుడిపై అక్షింతలు వేయాలి.


ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం శచీపురందరాభ్యాం నమః ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ఓం శ్రీ సితారామాభ్యాం నమః ||నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు||


 (క్రింది విధముగా చదువుతూ అక్షింతలు వాసన చూసి వెనుక వేసుకోవాలి)


శ్లో: ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే


(ప్రాణాయామం) ఓం భూః | ఓం భువః | ఓగ్ సువః | ఓం మహాః | ఓం జనః | ఓం తపః | ఓగ్ సత్యం |. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||


||ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్||.


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః || (అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్ళు చల్లాలి.


సంకల్పం: మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ( మీరు దగ్గరగా ఉన్న నదిని చెప్పుకోండి) నదీ సమీపే. నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం, భృగవాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్ ( ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకోవాలి)


ఆధౌ నిర్వఘ్నేన పరిసమాప్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే...తదంగ కలశారాధనం కరిష్యే అని చెప్పి కలశ జలంలోగంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి


కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |


మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |


కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |


ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |


అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |


ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |


గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు`


( కలశలో నీటిని మీపై, పూజా ద్రవ్యాలపై చల్లాలి)


పసుపు గణపతిపై అక్షింతలు వేస్తూ చదవాలి


ఓం గణానాంత్వా గణపతిగ్ంహావామహే కవిం కవీనాం ముమమశ్శ్రవస్తవం| జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశృణ్యన్నూతిభిస్సీద సాదనమ్.


శ్రీ మహాగణాధిపతియే నమః: ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత స్వర్ణ సింహసనం సమర్పయామి


శ్రీ మహాగణాధిపతయే నమ: ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపనంతరం శుద్దాచమనీయం సమర్పామి.


నైవేద్యం


ఓం భూర్భువస్సువ:ఓం తత్సవితుర్వేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్. నీళ్ళు పుష్పంతో చల్లి ఓం సత్యం త్వర్తేన పరిషించామి. పుష్పము నీటిలో ముంచి నైవేద్య పదార్ధమ్ చుట్టు తిప్పాలి. ఓం అమృతమస్తు | ఓమ్ అమృతోపస్తణమసి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా (క్రిందివిధంగా చదివి కలశములోని నీటి వదలవలెను.) మధ్య మధ్య పానీయం సమర్పణమి.


శ్రీ మహాగణాధిపతియే నమః తాంబులం సమర్పయామి


శ్రీ మహాగణాధిపతియే నమః: ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి


పూజ చేసిన అక్షింతలు, పూలు తలపై వేసుకుని


శ్లో : యస్యస్మృతాచ నామూక్త్యా తప: క్రిమాదిషు|న్యూనం సంపూర్ణతాం యాంతి సద్యో వందే గణాధిప | మంత్రహీనం క్రియా హీనం భక్తిహీనం గణాధిప | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన అవాహనాది షోడశోపచార పూజయా భగవన్ సర్వాత్మక: శ్రీ మహాగణాధిపతి: వరదోభవతు అని ఉదకం అక్షితలను చేతిలో వేసుకుని గణపతి కాళ్ళ దగ్గర వదిలి వేయాలి.


ఉద్వాసన


యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా: తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్యచం తే యత్ర పూర్వే సాధ్యాస్సతి దేవా: శ్రీ మహాగణపతిం యధాస్థానం ప్రవేశయామి శోభనార్ధే పునరాగమనాయచ|| పసుపు గణపతిని తమలపాకుతో తీసి పూజా మందిరం ఈశాన్య భాగంలో ఉంచవలెను.


ఇక్కడి వరకూ పసుపు గణపతి పూజ.. ఆ తర్వాత మీరు తీసుకొచ్చిన విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేసి మళ్లీ ఆచమనీయం చేసి గణపతికి షోడసోపచార పూజ చేయాలి


విగ్రహంపై పువ్వుతో పంచామృతాలు చిలకరించి ఇలా చెప్పాలి.. ఓ ఐంహ్రీంక్రోం యంరంలంవ శంషంసంహం-ఇత్యాదేనా ప్రాణప్రతిష్టాపనం కృత్వా, నమస్కృత్వా శ్రీ వరశిద్ధి వినాయకాయ నమ:


స్వామిన్ సర్వ జగన్నాథ యావత్పూజావసానకం


తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు//


భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే


ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్


ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం


షోడశోపచారపూజ


ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥


శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి


అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ


ఆవాహయామి


మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥


ఆసనం సమర్పయామి


గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥


ఆర్ఘ్యం సమర్పయామి


గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥


పాద్యం సమర్పయామి


అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥


ఆచమనీయం సమర్పయామి.


దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥


మధుపర్కం సమర్పయామి.


స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥


పంచామృత స్నానం సమర్పయామి.


గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥


శుద్దోదక స్నానం సమర్పయామి.


రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥


వస్త్రయుగ్మం సమర్పయామి.


రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥


ఉపవీతం సమర్పయామి.


చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥


గంధాన్ సమర్పయామి.


అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥


అక్షతాన్ సమర్పయామి.


సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥


పుష్పాణి పూజయామి.


వినాయక అష్టోత్తర శతనామావళి


ఓం గజాననాయ నమః   ఓం గణాధ్యక్షాయ నమః  ఓం విఘ్నరాజాయ నమః


ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః


ఓం ప్రముఖాయ నమః  ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః


ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః


ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః


ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః


ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః


ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః


ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః


ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః


ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః


ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బల్వాన్వితాయ నమః


ఓం బలోద్దతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః


ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః


ఓం చామీకర ప్రభాయ నమః  ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః


ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వ నేత్రే నమః ఓం నర్వసిద్దిప్రదాయ నమః


ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః


ఓం కుమార గురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః


ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః


ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః


ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః


ఓం మంగళసుస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం జ్యాయసే నమః


ఓం యక్షికిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః


ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః


ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః


ఓం అవ్యక్త రూపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః


ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః


ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః


ఓం సారాయ నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః


ఓం విశదాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః


ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ఓం విష్ణువే నమః


ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః


ఓం సతతోత్థితాయ నమః ఓం విష్వగ్దృశేనమః ఓం విశ్వరక్షావిధానకృతే నమః


ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరజయినే నమః


ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః


అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే


అథాంగ పూజ  ( పూలతో పూజచేయండి)


గణేశాయ నమః - పాదౌ పూజయామి


ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి


శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి


విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి


అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి


హేరంబాయ నమః - కటిం పూజయామి


లంబోదరాయ నమః - ఉదరం పూజయామి


గణనాథాయ నమః - నాభిం పూజయామి


గణేశాయ నమః - హృదయం పూజయామి


స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి


గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి


విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి


శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి


ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి


సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి


విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి




ఏకవింశతి పత్రిపూజ


(21 రకాల పత్రాలతో పూజించాలి)


సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।


గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।


ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।


గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి


హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।


లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।


గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।


గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,


ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,


వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।


భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,


వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,


సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,


ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,


హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి


శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,


సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,


ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,


వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,


సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।


కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।


శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.


అథ దూర్వాయుగ్మ పూజా


గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।


ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।


కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।


ధూపం


దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥


ధూపమాఘ్రాపయామి॥


దీపం


సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే


దీపందర్శయామి।


నైవేద్యం


సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,


భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,


నైవేద్యం సమర్పయామి।


సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక


సువర్ణపుష్పం సమర్పయామి.


తాంబూలం


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం


తాంబూలం సమర్పయామి।


ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ


నీరాజనం సమర్పయామి।


నమస్కారము, ప్రార్థన


ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,


ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,


అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,


పునరర్ఘ్యం సమర్పయామి,


ఓం బ్రహ్మవినాయకాయ నమః


నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,


ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్


వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ


నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.


శ్రీ వినాయక వ్రత కథ


సంస్కృత పదాలతో ఉన్న కథ చదివేందుకు కొందరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చదివేందుకు వీలుగా కొన్ని పదాలు మార్పు చేశాం.


గణపతి జననం


సూతమహర్షి శౌనకాది మునులకు ఇలా చెప్పారు. గజముఖుడయిన రాక్షసుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి కోరరాని వరం కోరాడు. తనను ఎవరూ వధించలేని శక్తిని ఇవ్వాలని, తన ఉదరం లోనే శివుడు నివశించాలని కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేర్చాడు. భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీ దేవి తన పతిని విడిపించాలని విష్ణువును కోరింది. విష్ణువు గంగిరెద్దు  వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏం కావలయునో కోరుకో" అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నీ ఉదరమందున్న శివుని కోసం వచ్చానని చెప్పాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం తెలుసుకుని తన ఆయువు తీరిందని అర్థం చేసుకున్నాడు. ఉదరంలో ఉన్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితం ముగియుచున్నది। నా అనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించాలని "  ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు  ఉదరం చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరం, చర్మం తీసుకుని కైలాశానికి బయలుదేరాడు.


అక్కడ పార్వతి భర్త రాక గురించి విని స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఓ ప్రతిమ చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించడంతో  ప్రాణం పోసింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రం పొందిన పార్వతి..ఆ మంత్ర ప్రభావంతో ప్రాణం పోసి ఆ బాలుడిని వాకిట ఉంచి తను స్నానానికై లోపలకు వెళ్లింది. ఆ సమయంలో వచ్చిన శివుడిని బాలుడు అడ్డగించాడు. లోపలికి పోనివ్వనని నిలువరించాడు. తన మందిరంలోకి తనను వెళ్లనివ్వకపోవడంతో శివుడు ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించాడు. జరిగినదంతా విని పార్వతి చింతిస్తుండగా..గజముఖాన్ని ఆ బాలుని మొండేనికి అతికించి త్రిలోక్య పూజనీయత కలిగించాడు.


విఘ్నాధిపత్యం


ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని..శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానం కోరుతాడు. అప్పుడు  శివుడు.. "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. కుమారస్వామి తన నెమలివాహనంగా జోరుగా వెళ్లిపోగా వినాయకుడు అక్కడే ఆగిపోయాడు. తన పరిస్థితి తండ్రికి వివరించి ముల్లోకాల్లో పవిత్రనదీ స్నాన ఫలితం చెప్పమని అర్థించాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు నారాయణ మంత్ర ఉపదేశించాడు. సర్వజగత్తును పరిపాలించే ఉమా మహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగివున్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. నారములు అంటే జలం, జలమున్నీ నారాయణుని ఆధీనాలు. అంటే ఆ మంత్ర ఆధీనాలు, మంత్ర ప్రభావంతో ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు కనిపించాడు. తప్పు తెలుసుకున్న కుమారస్వామి ఆధిపత్యాన్ని అన్న వినాయకునికే ఇచ్చేందుకు అంగీకరించాడు.




చంద్రుని పరిహాసం


గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయం మరిచిన చంద్రుడు వినాయకుడి వింత రూపం చూసి, తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కరించలేని వినాయకుడిని చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీ దేవి చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శిపిస్తుంది. అయితే అది కేవలం చంద్రుడికి మాత్రమే కాదు లోకానికి శాపం తల్లీ అంటూ శాపవిముక్తి చెప్పమని వేడుకున్నారు. బాధ్రపద శుద్ధ చవితినాడు గణపతి పూజచేసి  కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంటే నిలాపనిందలు పోతాయని..అప్పుడు చంద్రుడిని చూసినా ఎలాంటి దోషం ఉండదని అనుగ్రహించారు.


అలా చేయనందున శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పలేదు ఈ కష్టం




శమంతకోపాఖ్యానం


వినాయక చవితి రోజున పాలలో చంద్రబింబం చూసిన శ్రీకృష్ణుడు నిలాపనింద పాలయ్యాడు. సత్రాజిత్తు అనే మాహారాజు సూర్యోపాసనతో శ్యమంతకమను మణిని సంపాదించాడు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ఇస్తుందా మణి. అంతటి శక్తివంతమైన మణిని ఇమ్మని శ్రీకృష్ణుడు కోరతాడు. ఆ కోరికను తిరస్కరిస్తాడు సత్రాచిత్తు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ప్రేసనుడు విలాసంగా ఆ మణిని ధరించి వేటకెళ్లాడు. ఆ మణిని మాంసపు ముక్క అని భావించిన సింహం ప్రసేనుడిని చంపి ఆ మణిని నోట కరుచుకుని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి కోసం శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపాడని నిందలపాలు చేశాడు.


చవితి రోజున పాలలో చంద్రుడిని చూసినందున ఈ పరిస్థితి వచ్చిందని భావించిన కృష్ణుడు అడవిలో అన్వేషన సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరం కనిపించింది. అక్కడి నుంచి సింహపు అడుగు జాడలను అనుసరించి వెళ్ళాడు. ఒక ప్రదేశంలో సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అక్కడ గుహలో ఊయల తొట్టికి వేలాడుతున్న మణిని గమనించాడు. ఆ మణిని అందుకునే ప్రయత్నం చేయగా భల్లూకం మీద పడింది.  ఏకంగా 28 రోజులు భీకర సమరం తర్వాత భల్లూకం శక్తి క్షీణించసాగింది.


అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక ఉన్నాడు. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరామ చంద్రుడే అని గ్రహించిన జాంబవంతుడు స్తోత్రం చేయనారంభించాడు.  త్రేతాయుగంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయంగా శ్రీరాముడితో ద్వంద్వ యుద్ధం కోరాడు. అప్పట్లో నెరవేరని ఆ కోరిక కృష్ణావతారంలో నెరవేరింది. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి తన కుమార్తె జాంబవతితో పాటూ శమంతకమణి అప్పగించి కర్మ బంధ విముక్తి పొందాడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకెళ్లి సత్రాజిత్తుడిని ఇచ్చి జరిగిన విషయం తెలిపాడు. పశ్చాత్తాపము చెందిన సత్రాజిత్తు మణితో సహా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.


వినాయక వ్రతం చేయక చంద్రబింబం చూడడం వల్ల ఈ నింద మోయాల్సి వచ్చిందని వివరించాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచీ జగమంతా బాధ్రపద శుద్ధ చవితి రోజు వినాయకుని యథాశక్తి పూజించి శ్యమంతకమణి కథను విని అక్షితలు శిరస్సుపై వేసుకుంటున్నారు.


ఓం గం గణపతయే నమః


నీరాజనం…


చివరిగా…


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా


యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తతే |


నేను చేసిన పూజావిధానంలో లోపం ఉన్నా..నా భక్తిలో ఎలాంటి లోపం లేదని అర్థం.


గణపయ్యకు 11 గుంజీలు తీసి మొక్కుకుంటే సకల విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం