సమాజంలో మహిళలపై తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ లేని సమయం చూసి వారిపై అఘాయిత్యాలకు సైతం పలువురు దుర్మార్గులు పాల్పడుతున్నారు. ముఖ్యంగా పని చేసే చోట, కాలేజీకి వెళ్లేటప్పుడు మహిళలకు ఈ వేధింపులు అక్కడక్కడా తప్పడం లేదు. అమ్మాయిలను ప్రాణాలతో విడిచి పెడితే తమ పేరు ఎక్కడ బయట పెడతారో అని వారి ప్రాణాల‌ను సైతం తీసేందుకు కొంత మంది వెనకాడడం లేదు. ఇది కేవలం ఎవరూ లేని సమయంలో జరిగే సంఘటనలు. కానీ, తాజాగా బహిరంగంగా జరిగిన ఓ ఘటన మాత్రం కలకలం రేపుతోంది. కొంత మంది వ్యక్తులు యువతులపై పిడి గుద్దులు గుద్దారు. ఈ ఘటన ఏకంగా బస్సులోనే జరగడం గమనించదగ్గ విషయం. బస్సు నిండా ప్రయాణికులు ఉన్నా వారిని ఆపేందుకు ఎవరూ యత్నించలేదు.


ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మైన చింతామణి-శ్రీనివాసపురం బస్సులో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుల వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీన్ని గమనించిన అబ్బాయిల తల్లిదండ్రులు వీడియో చిత్రీకరించిన అమ్మాయిలపై దాడికి దిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.


వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చింతామణి శ్రీనివాసపురం బస్సులో అమ్మాయిలను కొందరు యువకులు వేధింపులకు గురి చేశారు. ఇది గమనించిన ఓ వర్గం.. అమ్మాయిలను వేధిస్తున్న యువకులపైకి గొడవకు దిగారు. ఈ గొడవను తమతో పాటు తెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లో అమ్మాయిలు చిత్రీకరించి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆ అమ్మాయిలపై గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయిలు బస్సు దిగేలోపే యువకుల తల్లిదండ్రులు అమ్మాయిలపై దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Hyderabad: ఆన్‌లైన్‌ క్లాసులో ఊహించని ట్విస్ట్.. భయపడిపోయిన లెక్చరర్, విద్యార్థులు


Also Read: Hyderabad: హుస్సేన్ సాగర్ ఒడ్డున అంబేడ్కర్ భారీ విగ్రహం.. అప్పటికల్లా నిర్మాణం పూర్తి, మంత్రి వెల్లడి


Also Read: Huzurabad: హుజూరాబాద్‌లో పోటీపై కొండా సురేఖ క్లారిటీ.. మరో ట్విస్ట్ కూడా..


Also Read: Nalgonda Crime: బ్లేడుతో యువతి గొంతు కోసిన వ్యక్తి.. పారిపోయిన నిందితుడు, కారణం ఏంటంటే..


Also Read: LoKesh Today : రోజంతా లోకేష్ టూర్ హైవోల్టేజ్ టెన్షన్ ! చివరికి ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులిచ్చిన పోలీసులు !