ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 62,856 మంది నమూనాలు పరీక్షించారు. 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,311 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,624 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ వల్ల కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారని బులెటిన్ లో వైద్యారోగ్య శాఖ తెలిపింది.
అనంతపురంలో 23, చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో 170, గుంటూరులో 142, కడపలో 66, కృష్ణాలో 131, కర్నూలులో 8, నెల్లూరులో 260, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 79, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 09/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,23,147 పాజిటివ్ కేసు లకు గాను
*19,94,559 మంది డిశ్చార్జ్ కాగా
*13,964 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,624#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nNihF7LJZr
— ArogyaAndhra (@ArogyaAndhra) September 9, 2021
" title="" >
ఏపీలో కరోనా పరిస్థితులో హైకోర్టులో నిన్న వాదలను జరిగాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ ఆంక్షలను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని , మాస్కులు ధరించడం లేదని అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం జీవోలు ఇస్తున్నా .. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.
మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా వేస్తున్నామన్నారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యల పురోగతిని పరిశీలించేందకు విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ కట్టడిపై చర్యలను హైకోర్టు పర్యవేక్షిస్తూ విచారణ జరుపుతుంది. ఉపాధ్యాయులకు టీకా పూర్తికాకుండానే.. 50 % మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే టీకాలు పూర్తి అయ్యాయని అమికస్ క్యూరీ వాదనలు వినిపించారు. మొత్తం ఉపాధ్యాయులకు పూర్తి కాకుండానే బడులు తెరిచారన్నారు. తర్వాత కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
Also Read: RRR Vs YSRCP : ఓదార్పు హక్కు జగన్‌కే ఉంటుందా.. లోకేష్ అడ్డగింతపై ఎంపీ విమర్శలు