పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించే ప్రావిడెంట్ ఫండ్ చాలా ముఖ్యం. దీనిపై జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. అయితే తాజాగా.. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ట్విట్టర్ ద్వారా 6 కోట్ల మంది ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు వ్యక్తిగత సమాచారం, యాప్ డౌన్‌లోడ్లపై సూచనలు చేసింది.
Also Read: Air India: హైదరాబాద్-లండన్ నాన్‌స్టాప్ విమాన సర్వీసులు.. ఎయిర్ ఇండియా ప్రకటన, ఎప్పటినుంచంటే..
పదవీ విరమణ తర్వాత.. అండగా ఉండేది పీఎఫ్. సర్వీస్ అయిపోయాక.. ఆర్థికంగా భద్రతనిస్తుంది. అందుకోసమే.. పీఎఫ్ డబ్బుపై జాగ్రత్తగా ఉండాలి. పీఎఫ్ గురించి వచ్చే నకిలీ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలి. 'ఈపీఎఫ్ఓ తన ఖాతాదారుల నుంచి UAN నంబర్, ఆధార్ నంబర్, PAN నంబర్ లేదా బ్యాంక్ వివరాలను ఫోన్ కాల్‌లలో ఎప్పుడూ అడగదు. అసలు తన ఖాతాదారులకు ఎలాంటి ఫోన్ కాల్స్ చేయదు.' అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.
అలా మీకు.. మీకు నకిలీ ఇన్ కమింగ్ కాల్స్ వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. మీ ఈపీఎఫ్ ఖాతాకు లాగిన్ అవ్వడానికి.. హ్యాకర్స్ ప్రయత్నం చేస్తారు. అలాగే.. నకిలీ వెబ్ సైట్లతో కూడా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. సమాచారం దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది.
బ్యాంకులు కూడా తమ వినియోగదారులు.. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో బ్యాంకింగ్ మోసాలు ఎక్కువగా పెరిగాయి. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, డిజిటల్ లావాదేవీల కారణంగా 2018-19 సంవత్సరంలో మొత్తం రూ .71,543 కోట్ల వరకూ.. ఫ్రాడ్ జరిగింది. 6800 కంటే ఎక్కువ బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. కిందటి ఆర్థిక సంవత్సరాల్లో, మొత్తం 53,334 బ్యాంక్ మోసాల కేసులు నమోదయ్యాయి.
Also Read: Amazon sale: రూ.16 వేలకే 40 ఇంచుల టీవీ... త్వరగా బుక్ చేసుకోండి