రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించారు. మొత్తం మూడు రాష్ట్రాలకు గవర్నర్‌ల మార్పు చోటు చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల విషయంలో గవర్నర్‌లకు స్థాన చలనం కలిగింది.


మాజీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌ను ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా నియమించారు. ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న జగదీష్‌ ముఖికి అదనంగా నాగాలాండ్‌ బాధ్యతలు అప్పగించారు.


Also Read: Hyderabad: ఆన్‌లైన్‌ క్లాసులో ఊహించని ట్విస్ట్.. భయపడిపోయిన లెక్చరర్, విద్యార్థులు


నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న ఆర్‌ ఎన్‌ రవిని తమిళనాడుకు బదిలీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్‌ పురోహిత్‌ను పంజాబ్‌ గవర్నర్‌గా పంపించారు. ఈ మేరకు రాష్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీరి మార్పునకు ఆమోదముద్ర వేశారు.


Also Read: Income Tax Returns Extension: ఐటీఆర్ దాఖలు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?


పంజాబ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు రానున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఈమె స్థానంలోనే ఉత్తరాఖండ్‌కు మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్‌ను నియమించారు. తాజాగా చేసిన నియామకాలు వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Also Read: Indian Air Force: నేషనల్ హైవేపై 'సుఖోయ్' ఫైటర్ జెట్ ల్యాండింగ్.. వీడియో చూశారా?