Corona Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. తాజాగా 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
- డైలీ పాజిటివిటీ రేటు: 4.13 శాతం
- మొత్తం కేసులు : 4,38,03,619
- మొత్తం మరణాలు: 5,28,388
- యాక్టివ్ కేసులు: 1,43,091
- మొత్తం రికవరీలు: 4,31,32,140
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 26,04,797 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200.61 కోట్లు దాటింది. మరో 4,98,034 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ
Also Read: COVID-19 Vaccine in India: 'ఇది మీ వల్లే సాధ్యమైంది'- భారత్ రికార్డ్‌పై ప్రధాని మోదీ లేఖ
Also Read: Jharkhand News: ఝార్ఖండ్‌లో కూడా సేమ్ టూ సేమ్- మహిళా ఎస్‌ఐ దారుణ హత్య