Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 15,528 కరోనా కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతి చెందారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,113 మంది కోలుకున్నారు.






మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.33 శాతం ఉన్నాయి. 



  • మొత్తం కేసులు: 4,37,83,062

  • మొత్తం మరణాలు: 5,25,785

  • యాక్టివ్​ కేసులు: 1,43,654

  • మొత్తం రికవరీలు: 4,31,13,623


వ్యాక్సినేషన్






దేశంలో కొత్తగా 27,78,013 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.5 కోట్లు దాటింది. మరో 4,68,350 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ


కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు


Also Read: UGC on Ad-hoc Teachers : తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ప్రతిపాదన లేదు, తేల్చేసిన కేంద్రం


Also Read: Shinde Shocks Toddler Rocks : షిండే సార్ ఈ సారి నన్నూ గౌహతి తీసుకెళ్లండి సీఎం అవుతా ! ఆ పాప అమాయకంగా అడిగిందా ? పంచ్ వేసిందా ?