Shinde Shocks Toddler Rocks : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఓ చిన్న పాప దగ్గర్నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆయన అధికార విధుల్లో ఉన్న సమయంలో ఓ పాప తన చాంబర్ ముందు ఎదురు చూస్తూ ఉంది. ఆ పాప తల్లిదండ్రులు కూడా ఆ చుట్టపక్కల ఉన్నారు కానీ పట్టించుకోలేదు. ఈ లోపు ముఖ్యమంత్రి షిండే తన చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ ఉన్న పాపను చూశారు. ఏం కావాలమ్మా అని అడిగారు.
హెల్మెట్ పెట్టుకుని బస్ నడుపుతున్న డ్రైవర్ - యూపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్ !
సీఎం కదా .. ఇదంతా పక్కన ఉన్న వాళ్లు వీడియో తీయడం ప్రారంభించారు. ఆ పాపం ఏం తడుముకోలేదు. తనకు ఏదో రాజకీయం తెలిసినట్లుగా.. సీఎం సార్ ఈ సారి మీరు వెళ్లేటప్పుడు నన్ను గౌహతి తీసుకెళ్లండి. నేను కూడా వరద బాధితులకు సాయం చేస్తే ముఖ్యమంత్రి అవుతానా ? అని ప్రశ్నించేసింది. దీంతో ఏం చెప్పాలో తెలియక ముఖ్య మంత్రి నీళ్లు నమలాల్సి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల శివసేన ఎమ్మెల్యేల్ని తీసుకుని గౌహతిలోనే క్యాంప్ నిర్వహించారు. ఆ సమయంలో అస్సాం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అక్కడ చాలా రోజులు క్యాంప్ నిర్వహించిన తర్వాత వచ్చే టప్పుడు రూ. యాభై లక్షలను వరద బాధితులకు విరాళంగా ఇచ్చి వచ్చారు. తాము అక్కడ వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లామని ప్రచారం చేసుకున్నారు.
నేనేమీ క్రిమినల్‌ను కాదు సీఎంని, ఎందుకు అడ్డుకుంటున్నారు-కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్
ఇది ఆ చిన్నారి మనసులో పాతుకుపోయినట్లుగా ఉంది.. సీఎం కనిపిస్తే నేరుగానే అడిగేసింది. ఇలాంటి ప్రశ్నలు వస్తే సీఎం షిండే పాపం సమాధానం వెదుక్కోవాల్సి వస్తోంది. కానీ అన్నీ షిండే కు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.