ఫార్చూన్ బ్రాండ్ నూనె ధరలు తగ్గాయ్..
అదానీ విల్మర్ కంపెనీ ఓ శుభవార్త వినిపించింది. ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనె అమ్ముతున్న ఈ సంస్థ..ఒక్కో లీటర్‌పై రూ.30 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయంగా వంట నూనె ధరలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సోయాబీన్ ఆయిల్‌పై ఈ గరిష్ఠ తగ్గింపు వర్తిస్తుందన్న తెలిపింది. ఫిబ్రవరి 7వ తేదీన మదర్ డెయిరీ సంస్థ కూడా సోయాబీన్ ఆయిల్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసింది. ధారా బ్రాండ్ పేరిట వంట నూనెలు అమ్ముతున్న ఈ కంపెనీ సోయాబీన్ లీటర్ నూనెపై రూ.14 తగ్గించింది. ప్రస్తుతానికి ఫార్చూన్ కంపెనీ సోయాబీన్ ఆయిల్ లీటర్ ధర రూ.195 నుంచి రూ.165కి తగ్గింది. ఇక సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.210 నుంచి రూ. 199కి మారింది. మస్టర్డ్ ఆయిల్ లీటర్ ధర రూ. 195 కాగా..రూ. 190కి తగ్గించింది. పల్లీనూనె విషయానికొస్తే..లీటర్ ధర రూ. 220 ఉండగా,రూ. 210కి తగ్గించింది. మిగతా నూనెల ధరలు కూడా తగ్గాయి. "అంతర్జాతీయంగా నూనల ధరలు తగ్గాయి. ఆ మేరకు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా వెంటనే ధరల్లో మార్పులు చేశాం. కొత్త స్టాక్ మార్కెట్‌లోకి రాగానే తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయి" అని అదానీ విల్మర్ సంస్థ స్పష్టం చేసింది. ధరలు తగ్గించటం వల్ల రానున్న పండుగ రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది.
ధరలు తగ్గించాలని సూచించిన కేంద్రం
ఆరు నెలలుగా నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వంట నూనెల ధరలకైతే కళ్లెం పడటం లేదు. ఈ క్రమంలోనే
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. వంట నూనెలు తయారు చేసే సంస్థలు వెంటనే ధరలు తగ్గించాలని సూచించింది. లీటర్ నూనెపై రూ.10 తగ్గించాలని కంపెనీలకు తెలిపింది. వారం రోజుల్లో ఈ మేర తగ్గించాలని స్పష్టం చేసింది. ఫుడ్ సెక్రటరీ సుధాంషు పాండే ఇదే విషయాన్ని వెల్లడించారు. ధరలు తగ్గించటంతో పాటు సంస్థలన్నీ దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులపై ఒకే ధర ఉండేలా చర్యలు చేపట్టాలనీ అడిగింది. నిజానికి అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు ఇటీవలే తగ్గాయి. ఈ నేపథ్యంలోనే ఆహార మంత్రిత్వ శాఖ వంట నూనెల తయారీ సంస్థలతో సమావేశమైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున దేశీయంగా రిటైల్ ధరలు తగ్గించాలని చెప్పింది. " వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా 10% ధరలు తగ్గాయని మేము గుర్తు చేశాం. ఈ మేరకు ప్రజలపై భారం తగ్గాల్సిందే. అందుకే తయారీ సంస్థలతో చర్చించాం" అని సుధాంషు పాండే వెల్లడించారు. ఈ చర్చల తరవాతే అదానీ విల్మర్..నూనె ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
Also Read: Dil Raju: పది కథల్ని పక్కన పెట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, రెండు షూటింగులూ