Supreme Court AP :  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి  నుంచి  తీసుకున్న నిధులను రెండు వారాల్లో జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను మళ్లించరాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కూడా తాము పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను మళ్లీ జమ చేస్తామని తెలిపారు.  కరోనా నియంత్రణకు వినియోగించాల్సిన దాదాపు రూ.1,100 కోట్ల మేర ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి ఏపీ సర్కారు మళ్లించిందని టీడీపీ నేత పల్లా శ్రీనివాస రావు పిటిషన్‌ దాఖలు చేశారు. 


విపత్తు నిధులను పీడీ ఖాతాలకు మళ్లించిన ఏపీ ప్రభుత్వం 


ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం 2019-20లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందించిన రూ. 1100 కోట్లను పీడీ ఖాతాలకు సర్దుబాటు చేసింది. కానీ, వాస్తవానికి ఈ నిధులను ఖర్చు చేయలేదు.  ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను నిర్దేశించిన ప్రయోజనానికి కాకుండా వేరే అవసరాలకు మళ్లించడం.. ఏ అవసరాల కోసం మళ్లించారో దానికోసం ్జ్జకూడా వినియోగపెట్టకపోవడం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలకు విరుద్ధం’’ ఇదే అంశాన్ని వివరిస్తూ.. పిటిషన వేశారు.  ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. 


ఏపీ ప్రభుత్వం  అక్రమంగా నిధులు మళ్లించిందని సుప్రీంకోర్టుకు తెలిపిన కాగ్, కేంద్రం 


రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వ్యవసాయ కమిషనరేట్‌ వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాకు బదలాయించారని, ఈ నిధులతో కరోనాకు సంబంధం లేదని మొదట ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. తాత్కలికంగా మాత్రమే బదిలీ చేశామని చెప్పారు. దీంతో  ‘‘తాత్కాలికంగా మాత్రమే బదిలీ చేశారు కాబట్టి ఆ నిధులు తిరిగి రావాల్సిందే.’’ అని సుప్రీంకోర్టు గతంలోనే తేల్చిచెప్పింది.  నిధుల మళ్లింపుపై కాగ్‌ సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించింది.  కాగ్‌.. ఈ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేసింది. విపత్తుల నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) ఖాతా నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాలకు (పీడీఏ) నిధులు మళ్లించడమే కాకుండా రెండేళ్లుగా వాటిని వినియోగించకుండా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది.


రెండు వారాల్లో  జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం


కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం నిధులు మళ్లించిందని ఇది  చట్ట విరుద్దమని సుప్రీంకోర్టుకు తెలిపింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో విపత్త నిర్వహణ నిధులు మళ్లీ ఆ ఖాతాలకు జమ కానున్నాయి.   దీంతో ఈ వివాదానికి ముగింపు లభించిటనట్లయిందని భావిస్తున్నారు . ఒక వేళ జమ చేయకపోతే పిటిషనర్ సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్తారు.