CBDT New Rules: అక్రమార్కుల లావాదేవీలు అరికట్టేందుకు బ్యాంక్‌ రూల్స్‌ను మరింత కఠినం చేస్తోంది. చట్టవిరుద్ధమైన, లెక్కలు చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం ఏడాది ప్రారంభంలో నగదు పరిమితి రూల్స్‌ సవరించింది. పరిమితికి మించి నగదు చెల్లించడం లేదా స్వీకరించడం చెల్లించిన లేదా స్వీకరించిన మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించనుంది.


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) రూపొందించిన కొత్త రూల్స్‌ ప్రకారం సంవత్సరానికి రూ. 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలనుకునే వ్యక్తులు ఇప్పుడు పాన్, ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకుల్లో ఒకే ఏడాదిలో అమౌంట్‌ విత్‌డ్రా, పెద్ద మొత్తాల్లో డిపాజిట్ చేయడం వంటివి ట్రాక్ చేయడానికి పాన్ ఆధార్ వివరాలు అందివ్వాలి.  "ప్రతి వ్యక్తి కాలమ్ (2)లో పేర్కొన్న పరిధిలోకి వచ్చేటప్పుడు పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు నంబర్‌ను, లావాదేవీకి సంబంధించిన డాక్యుమెంట్స్‌ ఇవ్వాలి. ఇచ్చిన వ్యక్తి పేరు కూడా రాయాలి. ఇచ్చిన వివరాలు సరైనవా కావా నిర్దారిస్తూ కాలమ్ (3)లో డాక్యుమెంట్స్‌ తీసుకున్న వారి వారు తమ వివరాలు నమోదు చేయాలి" అని మే 10 నాటి నోటీసులో CBDT పేర్కొంది.


పాన్ కార్డు లేని వ్యక్తులు రోజుకు రోజుకు 50 వేలు లేదా ఏడాదికి 20 లక్షల లావాదేవీలు జరపాలంటే... డిపాజిట్ చేసేందుకు వారం ముందుగానే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి.  ఆర్థిక నేరాన్ని తగ్గించేందుకు ఆదాయన పన్ను శాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు గత కొన్నేళ్లుగా కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. అలాగే ఉన్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాయి.  అందులో భాగంగానే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బును తీసుకోరాదు. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బును తీస్కోవడాన్ని ప్రభుత్వం కూడా నిషేధించింది. ఈ క్రమంలోనే నగదు లావాదేవీలపై కొన్ని పరిమితులను పెట్టింది. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


భారతదేశ ఆదాయపు పన్ను చట్టాలు 2 లక్షల కంటే ఎక్కున నగదు లావాదేవీలను నిషేదించాయి. ఉదాహరణకు 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను మీరు కొనాలనుకుంటే రెండు లక్షల డబ్బులు చెల్లించి మరో లక్ష రూపాయల కోసం క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ చెక్కు మాత్రమే ఉపయోగించాలి. డబ్బును అస్సలే వినియోగించరాదు. మీ దగ్గర నగదు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. అలాగే మీరు ఎవరి దగ్గరనుంచైనా డబ్బులు పొందాలనుకుంటే ఒక రోజులో రెండు లక్షల కంటే ఎక్కువ పొందలేరు. ఒకవేళ రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బులు మీరు ఎవరి నుంచైనా స్వీకరిస్తే.. అందకున్న  మొత్తం డబ్బుకు సమానంగా కూడా జరిమానా పడవచ్చు. ఆరోగ్య బీమా కోసం నగదు చెల్లిస్తే.. సెక్షన్ 80డి వర్తించదు. అదే ఆన్ లైన్ ద్వారా నగదును చెల్లిస్తే.. సెక్షన్ 80డిని పొందవచ్చు. ఆర్థిక సంస్థ నుంచి లేదా ఎవరైనా స్నేహితుడి నుంచి రుణం తీస్కుంటే 20 వేలకు మించకూడదు. అలాగే చెల్లించేటప్పుడు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఆస్తి లావాదేవీల్లో గరిష్ట నగదు పరిమితి కూడా 20 వేలకు మించొద్దు. అళాగే స్వయం ఉపాధి పన్ను చెల్లింపుదారుల విషయానికి వస్తే... ఒకే రోజులో వ్యక్తికి నగదు రూపంలో చెల్లిస్తే 10 వేల కంటే ఎక్కువ క్రైల్ చేయలేరు. ట్రాన్స్ పోర్టుకు ఇచ్చిన చెల్లింపుల కోసం చట్టం 35 వేల అధిక థ్రెషోల్డ్ ని ఏర్పాటు చేస్తుంది.