Helmet For Bus Driver :   బైక్ మీద హెల్మెట్ లేకుండా వెళ్లడానికి చాలా మంది బయపడతారు. అయితే ఈ భయం యాక్సిడెంట్ అయిపోతుందేమో అని కాదు. ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కెమెరాతో క్లిక్ మనిపిస్తాడో.. ఎక్కడ చలాన్ ఇంటికొస్తుందోననే భయమే ఎక్కువగా ఉంటుంది . ఈ పోలీసుల దూకుడు ఎలా ఉంటుందటే ఒక్కో సారి కారులో కూర్చున్నా హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ జనరేట్ చేస్తూంటారు.  యూపీలోని ఓ బస్ డ్రైవర్‌ను చూస్తే ఆ భయం కాస్త ఎక్కువే ఉన్నట్లుగా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఆయన హెల్మెట్ పెట్టుకుని బస్ నడిపేస్తున్నాడు. 


ఆ డ్రైవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌ డిపోకు చెందిన బస్సు చాలా పాతది. ఎంత పాతది అంటే.. అద్దం పగిలిపోయిన రిపేర్లు చేయించలేదు. అక్కడే  అక్కడ రోడ్లు అంతంత మాత్రంగా ఉంటాయి. దీంతో డ్రైవర్ ఎందుకైనా మంచిదని హెల్మెట్ పెట్టుకుని బస్ డ్రైవింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలా చేస్తున్న సమయంలో ఎవరో ఫోటో తీసి వైరల్ చేశారు. 


బస్సుకు అద్దాలు పగిలిపోవడంతో డ్రైవ్‌ చేసేటప్పుడు తనకెలాంటి గాయాలు కాకుండా.. వర్షం, గాలి నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్‌ ధరంచానని డ్రైవర్ చెుతున్నారు. అది సర్వీసులో ఉన్న బస్సు కాదని.. ఎక్కడో ప్రమాదానికి గురైతే డ్రైవర్ తీసుకొస్తున్నాడని అక్కడి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. వారేం చెప్పినా రాజకీయ నేతలు మాత్రం చేయాల్సింది చేస్తున్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేసి ప్రచారానికి అసలు పనికి చేలా తేడా ఉందనేలా ట్వీట్ చేశారు. 


 










ఈ హెల్మెట్ డ్రైవర్ చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియా విడిపోయింది. యూపీ ప్రభుత్వం తప్పేమీ లేదని కొంత మంది వాదనకు దిగుతున్నారు. ఆయన తప్పేనని కొందమంది రివర్స్ అవుతున్నారు.