భారత్‌లో థర్డ్‌వేవ్‌ స్టార్ట్ అయిపోయిందంటున్నారు సైంటిస్టులు. డిసెంబర్‌ మధ్య నుంచే కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని పేర్కొంటున్నారు. ఇది క్రమంగా పెరుగుతోందని.. వచ్చే ఫిబ్రవరి నాటికి పీక్స్‌కు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. 
ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పరిశోధకులు చేశారీ పరిశోధన. ఇప్పటి వరకు వస్తున్న కేసుల డాటాను పరిశీలించారు. సాంకేతికతను ఉపయోగించి చేసిన సర్వేలో చాలా విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. 


Also Read: నాగార్జున వస్తే.. పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..?


కరోనా రెండు విడతల కేసుల తీరును పరిశీలించి మూడో వేవ్‌కు సంబంధించిన పరిస్థితిని అంచనా వేసింది ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్టుల బృందం. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్‌వేవ్‌ ఎదుర్కొంటున్న దేశాల డేటాను కూడా వాడుకున్నారు. రోజువారిగా అక్కడ వస్తున్న కేసుల తీరును పరిశీలించారు. వాటన్నింటినీ సమీక్షించిన తర్వాత భారత్‌లో కూడా థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని నిర్దారణకు వచ్చారు. 
సుమారు డిసెంబర్‌ మధ్యలోనే థర్డ్‌వేవ్‌ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వైరస్‌ వ్యాప్తి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు శాస్త్రవేత్తలు. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?


ఈ సర్వేతోపాటు ఐఐటీ కాన్పూర్‌, హైదరాబాద్ శాస్త్రవేత్తలు కూడా వేరేగా మరో సర్వే చేశారు. రోజువారి కేసుల సంఖ్య డెల్టా వేరియంట్‌ కంటే ఎక్కువగా ఒమిక్రాన్‌ కేసులు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు విద్యాసాగర్, మణినంద అగర్వాల్‌. 
ప్రస్తుతం దేశంలో రోజువారిగా ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మూడు నుంచి నాలుగు వందల వరకు డెత్‌ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగాయి. ప్రస్తుతం 213కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది. 
213ఒమిక్రాన్ కేస్‌లలో 90మందికిపైగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. పదిహేను రాష్ట్రాలు ఈ కొత్త వేరియంట్‌ బారిన పడ్డాయి. ఒక్క దిల్లీలోనే యాభైకిపైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. తర్వాత స్థానం మహారాష్ట్రదే. 
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ ఎక్కువ మంది తీసుకోవడం.. హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వ్యాధిగస్తులు సంఖ్య పెరిగినా... తీవ్రత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. 


Also Read: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా... కొత్తగా 103 కేసులు, ఇద్దరు మృతి


Also Read: తెలంగాణలో 11 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌.. చలి గాలులకు వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు


Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి