తెలంగాణలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఇటీవల సూడాన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడ్ని గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుతో తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కి చేరింది. హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు నమోదు అవ్వడంతో వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కోవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి వ్యాక్సిన్‌ తీసుకోలేదని వైద్యాధికారిణి వెల్లడించారు. హయత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో మొదటి ఒమిక్రాన్‌ కేసు నమోదు అయ్యిందని కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌రెడ్డి తెలిపారు. సూడాన్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ సోకిందని వెల్లడించారు. ముందుజాగ్రత్తగా కాలనీ వాసులందరికీ కోవిడ్ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించినట్టు పేర్కొన్నారు.





 


Also Read: ఈ ఏడాది డ్రంకన్ డ్రైవ్ కేసులే అత్యధికం... డ్రంకన్ డ్రైవ్ లో రూ.10.49 కోట్ల ఫైన్ వసూలు... నేరాల వివరాలు వెల్లడించిన సీపీ అంజనీ కుమార్


గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్ జీనోమ్ సీక్వెన్సింగ్


తెలంగాణలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గక ముందే కొత్త వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ 24 కేసులుంటే హయత్ నగర్ కేసుతో ఆ సంఖ్య 25కు చేరింది. తెలంగాణలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిని టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం అధిస్తున్నారు. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఏర్పాటు చేస్తుంది. గాంధీ ఆసుపత్రిలో ఒమిక్రాన్‌ జీనోమ్ సీక్వెన్సింగ్ అందుబాటులోకి వస్తే రోజుకు 48శాంపిళ్లను పరీక్షించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 


Also Read: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్


Also Read: కో అంటే కోట్లు.. కోకాపేట భూముల వేలానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!


Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్ 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి