వాస్తు శాస్త్రం ప్రకారం, వాస్తు దోషం మీ ఇంట్లో మాత్రమే కాదు, మీ పనిప్రదేశాలలో కూడా ఉండొచ్చు. కొంతమందికి పని ప్రదేశంలో విసుగ్గా అనిపిస్తుంది, పనిచేయాలన్న ఆసక్తి కలగదు. అందరూ తమను దాటి పైకి ఎదుగుతున్నా, వారు మాత్రం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆఫీసులో మీరు కూర్చున్న ప్రదేశంలో ఉన్న వాస్తు దోషాలను కూడా పరిష్కరించుకుంటే సమస్యలు తగ్గి, ఉద్యోగంలో పురోగతిని సాధించవచ్చని చెబుతోంది వాస్తు శాస్త్రం.
చిన్న మొక్కలు
మొక్కల వల్ల కంటికి ప్రశాంతంగా, అందంగా కనిపించడమే కాదు, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి మీ డెస్క్ ప్లేస్‌లో చిన్న మొక్క పెట్టుకోండి. తూర్పు లేదా ఉత్తర దిశలో మనీ ప్లాంట్ లేదా వెదురు మొక్కలు పెట్టుకుంటే మంచివి. ఇవి సంపన్నతను అందిస్తాయి. ఆకుపచ్చ రంగు ఆనందాన్ని, శ్రేయస్సును, ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని సూచిస్తాయి.
ఉత్తర దిశలో...
మీరు కూర్చున్న స్థానానికి ఉత్తర దిశలో పచ్చని అడవి లేదా పంటలు వంటి వాల్ పేపర్స్, ఫోటోలను పెట్టుకుంటే చాలా మంచిది.
దక్షిణ, పడమర వైపు
మీరు కూర్చున్న స్థానానికి దక్షిణ, పడమర వైపు పర్వతాలు, రాళ్లు వంటి ప్రకృతి దృశ్యాన్ని కనిపించేట్టు పెట్టుకుంటే మానసిక స్థితి మెరుగవుతుంది. ఆనందంగా ఉంటారు. ఇలాంటి పెయింటింగ్స్ తూర్పు వైపు గోడలకు వేలాడదీసినా అదృష్టమే.
సముద్రం, నదులు...
ఉత్తర, పశ్చిమ దిశల వైపు గోడలకు సముద్రం, నదులు, సరస్సులు వంటి ప్రకృతి దృశ్యాలు కనిపించేట్టు ఫోటోలు పెట్టుకుంటే మంచిది.
మానసిక ప్రశాంతత కోసం...
మీకు ఆఫీసులో మానసిక ప్రశాంతత కరువైతే బుద్ధుడు లేదా మహావీర్ స్వామి చిత్రపటాలు, చిన్న విగ్రహాలను మీకు ఎదురుగా పెట్టుకోండి.
పూలతో లాభం
తాజా పూల గుత్తిని రోజూ మీ డెస్క్ పై ఉంచండి. అనుకూల శక్తి ప్రవహిస్తుంది. కానీ ఎండిన పూలను మాత్రం కళ్లెదురుగా ఉంచుకోవద్దు. అవి ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి.
ఇవి వద్దు
1. కొందరు ముళ్లు మొక్కలు, బోన్సాయ్, సకులెంట్స్ వంటి మొక్కలు పెట్టుకోకూడదు. ఇవి నిరాశను సూచిస్తాయి.
2. ఏడ్చే పాప, విరిగిన విగ్రహాలు, మునిగిపోతున్న ఓడలు, నిప్పు వంటివి ఇంట్లో, ఆఫీసులో కూడా ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని పెంచుతాయి.
Read Also: చీరకట్టుకూ రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి మధ్య బంధమేంటి?
Read Also: మనోళ్లు మాములుగా తినలేదుగా... నిమిషానికి ఎన్ని బిర్యానీలు కుమ్మేశారో తెలిస్తే షాకవుతారు
Read Also: లెక్కల వల్ల పిచ్చివాడు అవుతాడనుకున్నారు... కానీ ప్రపంచం మెచ్చిన గణిత శాస్త్రవేత్త ఎలా అయ్యారంటే..!
Read Also: ఉల్లి, అన్నం, బ్రెడ్, మొక్కజొన్న... ఇలాంటివి మాడినా కూడా తింటున్నారా? క్యాన్సర్ రావచ్చు జాగ్రత్త
Read Also: వీడెవడండీ బాబు... రిపేరుకు ఖర్చువుతుందని టెస్లా కారునే డైనమైట్లతో పీస్ పీస్ చేసేశాడు, వీడియో చూడండి
Read Also: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనే అర్థం