మొత్తానికి ఏదో ఒకటి చేసిన పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు. అయితే ఇప్పుడు 'భీమ్లానాయక్' ప్లేస్ లో 'బంగార్రాజు' సినిమా వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి రాబోతున్న 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలే. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు కాబట్టి వాటితో పోటీగా మరో సినిమా లేకుండా చూశారు గిల్డ్ ప్రొడ్యూసర్స్.
ఇప్పుడేమో 'బంగార్రాజు' సినిమా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. పవన్ సినిమాను కావాలని తప్పించి.. ఇప్పుడు 'బంగార్రాజు' సినిమాని అడ్డుకోకపోతే పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి 'బంగార్రాజు' సినిమాతో పోలిస్తే 'భీమ్లానాయక్'కి ఉన్న క్రేజే వేరు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్'లతో పోటీగా పవన్ సినిమా విడుదలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. థియేటర్ల సమస్య కూడా వస్తుంది.
పవన్ కి ఉన్న క్రేజ్, మార్కెట్ అలాంటిది. అందుకే నిర్మాతలు కాదంటున్నా.. ఎలాగోలా ఒప్పించి 'భీమ్లానాయక్'ను వాయిదా వేయించారు. కానీ 'బంగార్రాజు' విషయంలో ఆ టెన్షన్ పెద్దగా లేదనిపిస్తుంది. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' దర్శకనిర్మాతలకు కూడా 'బంగార్రాజు' రిలీజ్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవనే అనిపిస్తుంది.
కానీ ఇప్పటివరకు 'బంగార్రాజు' టీమ్ మాత్రం సంక్రాంతి రిలీజ్ విషయాన్ని ప్రకటించలేదు. ప్రకటిస్తే గనుక పవన్ ఫ్యాన్స్ నుంచి అటు గిల్డ్ ప్రొడ్యూసర్స్.. ఇటు 'బంగార్రాజు' టీమ్ ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదేమో. తమ అభిమాన హీరో సినిమాను వాయిదా వేయించి.. ఆ ప్లేస్ లో మరో సినిమాకి స్లాట్ ఇస్తే పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
Also Read:సూపర్ స్టార్ రజినీకాంత్.. నానికి ఛాన్స్ ఇస్తారా..?
Also Read:శంకర్-చరణ్ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. అదే ఫార్ములా..
Also Read:సముద్రఖని డైరెక్షన్.. త్రివిక్రమ్ ప్రొడక్షన్.. హీరోగా పవన్..
Also Read: అర్ధరాత్రి ఆ హీరో ఇంటి దగ్గర కెమెరా కంటికి చిక్కిన హీరోయిన్
Also Read: వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్