దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. కరోనా మరణాలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42,909 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 380 మంది కొవిడ్19 మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.


నిన్న ఒక్కరోజులో 34,763 మంది కరోనా మహమ్మారిని జయించారు. కరోనాను నుంచి కోలుకున్న వారి సంఖ్య 3. 19 కోట్లు (3 కోట్ల 19 లక్సల 23 వేల 405) అయింది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,38,210 (4 లక్షల 38 వేల 210)కి చేరింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 3 లక్షల 76 వేల 324గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. 


Also Read: Covid-19 Vaccine: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..






 


తాజాగా నమోదైన కేసులలో సగానికి పైగా ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వచ్చాయి. 29,836 కరోనా కేసులు, 75 కొవిడ్ మరణాలు కేరళలో సంభవించడం ఆందోళన పెంచుతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కరోనా కేసులు దిగొస్తుంటే, గత మూడు నెలలుగా కేరళలో పరిస్థితి క్షీణిస్తుంది. ఇటీవల ఆరుగురు సభ్యుల నిపుణుల టీమ్‌ను సైతం కేంద్ర ప్రభుత్వం కేరళకు పంపించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం వీకెండ్ కర్ఫ్యూలు, కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఇప్పటివరకూ 63.43 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.


Also Read: Himalayan Salt: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?