దేశంలో కొన్ని లక్షల మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. వారిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గాక సైడ్ ఎఫెక్టులు మొదలయ్యాయి. కొందరికి గ్యాస్ట్రిక్ సమస్యలు, నీరసం, కండరాల నొప్పులు, ఛాతీ నొప్పి, తలనొప్పి, నిద్రలేమి వంటివి కలుగుతున్నాయి. మరికొందరిలో విపరీతంగా జుట్టు రాలుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిన ఆడవాళ్లలో ఇది కనిపిస్తోంది. అయితే దీనికి కచ్చితమైన కారణాన్ని మాత్రం వైద్యులు తేల్చలేకపోయారు.  కరోనా బారిన పడినప్పుడు తెలియకుండానే తీవ్ర ఒత్తిడికి గురవుతుంది శరీరం. ఆ ఒత్తిడి వల్ల జుట్టు రాలడం ప్రారంభమవు తుందని భావిస్తున్నారు వైద్యులు. దాదాపు ఈ రాలే ప్రక్రియ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటూ సాగచ్చు.ఈ సమస్యకు చక్కటి పరిష్కారం బయోటిన్ తో దొరుకుతుందని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. 


బయోటిన్ అంటే?


బి విటమిన్లలో బయోటిన్ కూడా ఒకటి. దీన్నే విటమిన్ బి7 అని కూడా అంటారు. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది. పోషకాలను శక్తిగా మారుస్తుంది. ఇది జుట్టు ఎదుగుదలకు ఎంతో అవసరమైన కెరోటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. బయోటిన్ వల్ల చేతి గోళ్లు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. శరీరంలో బయోటిన్ తక్కువగా ఉంటే జుట్టు రాలడం, గోళ్లు పగుళ్లు బారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 


Also read: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..


ఎంత అవసరం


పెద్దవారికి రోజుకు 30 మైక్రోగ్రాముల బయోటిన్ అవసరం. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులకు 35 మైక్రోగ్రాముల బయోటిన్ అవసరం పడుతుంది. దాదాపు మనం తినే ఆహారం నుంచే ఆ మొత్తం వచ్చేలా చూసుకోవచ్చు. బయోటిన్ లోపం ఎక్కువగా ఉంటే వైద్యుని సలహాతో సప్లిమెంట్ల ద్వారా తీసుకోవచ్చు. కరోనా బారిన పడి కోలుకున్నాక జుట్టు రాలడం అధికంగా ఉంటే వైద్యుడిని కలిస్తే మంచిది. ఆయన మీకు బయోటిన్ విటమిన్ టాబ్లెట్లను ఉపయోగించమని చెబుతారు. 


Also read: గురువు మారాడు.. పూరి గుడిసెలో పాఠాలు చెప్పే దగ్గరి నుంచి.. నెట్టింట్లో ఆన్ లైన్ క్లాసులు దాకా


ఏ ఆహార పదార్థాలలో దొరుకుతుంది?


గుడ్డులోని పచ్చ సొన, చికెన్ లివర్, బాదం, వేరు శెనగ పలుకులు, వాల్ నట్స్, కాలిఫ్లవర్, పుట్టగొడుగులు, సోయా, అరటి పండ్లు వంటి వాటిల్లో బయోటిన్ లభిస్తుంది. వీటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.  
 


Also read: సోయా ఉల్లి పెసరట్టు ఎప్పుడైనా ట్రై చేశారా..