తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గినట్లే కనిపిస్తున్నా... థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రజల్లో భయాందోళనలు ఉన్నాయి. కరోనా మహమ్మారి రోజుకో రూపంతో వైద్యరంగానికి సవాల్ విసురుతోంది. ఇప్పటి వరకూ డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లు ప్రమాదకరం అనుకుంటే తాజాగా డెల్టా ప్లస్‌లో ఏవై.12 అనే మరో రకం మరింత ప్రమాదకరంగా మారింది. ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఏవై.12  వేరియంట్ తొలి కేసు ఆగస్టు 30న ఉత్తరాఖండ్‌లో నమోదైంది. వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఏవై.12 కేసులు దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 178 నమోదయ్యాయి. ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు వచ్చాయి. ఈ కేసుల నమోదులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.


Also Read: No Sleep: ఇదెక్కడి విడ్డూరం.. ఈ మహిళ 40 సంవత్సరాలుగా నిద్రపోలేదు.. రాత్రుళ్లు వాళ్లతో కలిసి..


ఊపిరితిత్తులపై ప్రభావం


దేశంలో పలు రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించినప్పుడు డెల్టా పస్ల్ ఏవై.12 కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాల నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీ, ఇతర చోట్లకు పంపి, వైరస్‌ వేరియంట్లను గుర్తిస్తున్నారు. ఈ పరిశోధనలో డెల్టా ప్లస్‌ వేరియంట్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది ఊపిరితిత్తుల కణాల్లో బలంగా అతుక్కుపోయి మోనోక్లోనల్‌ యాంటీబాడీ స్పందనను తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. 


రాకపోకలతో వైరస్ వ్యాప్తి


తెలుగు రాష్ట్రాలకు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి రాకపోకలు పెరుగుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారాల, ఇతర కారణాల నిమిత్తం నిత్యం వందల మంది ఇతర దేశాల నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్తుంటారు. దీంతో వ్యాధి సంక్రమణకు అవకాశాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌ నుంచి వివిధ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ కేసులు అప్పుడప్పుడూ వెలుగుచూశాయి. కొత్త వేరియంట్ల పేరు వినిపించాయి. వీటిని వీటిని ఏవై.1, ఏవై.2, ఏవై.3 పేర్లతో పిలుస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు తాజాగా పంపిన సమాచారంలో ఏవై.12 కేసులు 178 వచ్చినట్లు పేర్కొంది. ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా (వీఓసీ)’గా దీనిని ప్రకటించింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 


 


Also Read: Corona Effect: కరోనా కారణంగా ఏపీలో గురుపూజోత్సవాలు రద్దు.. కొత్తగా నమోదైన కేసులు 1,502