Horoscope Today : ఈరోజు ఈ మూడు రాశుల వారి ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు.. ఆ రాశుల వారు రిస్క్ తీసకోవద్దు..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

Continues below advertisement

2021 సెప్టెంబర్ 5 ఆదివారం రాశిఫలాలు

మేషం

ఉద్యోగులకు ఈ రోజు మంచిరోజు. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. విద్యార్థులకు చదువుపై మరింత శ్రద్ధ పెరుగుతుంది. కొత్త పనులపై ప్రయాణాలు చేస్తారు. అపరిచితులతో అనవసర ప్రసంగాలు వద్దు. చిన్న చిన్న సమస్యల వల్ల ఇంట్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బావుంటుంది.

Continues below advertisement

వృషభం

కెరీర్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెట్టుబడికి సంబంధించిన విషయాల్లో అడుగు ముందుకేయవద్దు. ఒత్తిడి దూరమవుతుంది.

మిధునం

ఈ రోజు మిధున రాశివారు మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. ఎక్కువ ఖర్చు చేస్తారు. స్నేహితుల మధ్య వివాదాలు మీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతాయి. కొత్త సమాచారం తెలుసుకుంటారు. రిస్క్ తీసుకోవద్దు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అధిక పని కారణంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు.

Also Read: నువ్వే రాజు - నువ్వే మంత్రి… ఎవరికోసం నువ్వు మారవద్దు: శ్రీశ్రీ రవిశంకర్

కర్కాటకం

ఈరోజు విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.  స్థిరాస్తిలో పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.

సింహం

అప్పుల నుంచి బయటపడతారు. చాలా కాలం నుంచి వెంటాడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో వివాదానికి అవకాశం ఉంది. ఒత్తిడి తీసుకోకపోవడమే మంచిది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృద్ధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

కన్య

కుటుంబంలో వాతావారణ బావుంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు కొత్త ప్రదేశానికి వెళ్లవచ్చు. అవివాహితులకు సంబంధాలు కుదురే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. బయట ఆహారం తీసుకోవద్దు.

Also Read:ఒంటరితనం పోగొట్టుకోవాలంటే ఒంటరిగానే ఉండాలి: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

తుల

ఈరోజు ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. సహోద్యోగుల నుంచి సహాయం పొందుతారు. ఏదైనా పని ప్రారంభించే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు. వ్యాపారస్తులు నష్టపోయే సూచనలున్నాయి. ఖర్చు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.

వృశ్చికం

ఈరోజు మీ దినచర్య మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. బంధువులను కలుస్తారు. టెన్షన్ పోతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎవరితోనూ వివాదం చేయవద్దు. అనవసరంగా ఖర్చు చేయవద్దు. మహిళల నుంచి ప్రయోజనం పొందుతారు.

ధనుస్సు

చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. మీ కెరీర్ కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ప్రయాణాలు చేయొద్దు. గాయపడే అవకాశాలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీకు తెలియని వ్యక్తితో వాదన ఉండవచ్చు.

Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు

మకరం

ఈ రోజు మీరు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చాలా కష్టపడతారు కానీ ఫలితం మాత్రం వేరొకరు పొందతారు. టెన్షన్ ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయడం ప్రారంభిస్తారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. బంధువుల నుంచి దుర్వార్తలు వినే అవకాశం ఉంది.

కుంభం

కొత్తగా చేపట్టిన బాధ్యతలు నెరవేరుస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఈ రోజు ఏపని చేపట్టినా లాభాలను ఆర్జిస్తారు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు దిశగా అడుగులు ముందుకు పడతాయి. పెట్టుబడి ఆఫర్లు పొందుతారు. పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు. రిస్క్ తీసుకోవద్దు. కొత్త సమాచారం అందుకుంటారు. వ్యాపారాలకు సంబంధించి చేసిన ప్రయాణాలు కలిసొస్తాయి.

మీనం

మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కుటుంబంలో విభేదాలు తలెత్తవచ్చు. వివాదాలను నివారించడానికి, మీరు పెద్దలతో చర్చించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దినచర్యను మార్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పిచ్చిన మొత్తం తిరిగి అందుకుంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. పిల్లలతో సమయం గడపండి. కొత్త వ్యక్తులను కలుస్తారు.

Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?

Also Read: కలియుగాంతం ఎప్పుడంటే….! ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలు?

Continues below advertisement
Sponsored Links by Taboola