పెసరట్టు ఉప్మా తిని ఉంటారు, అలాగే ఉల్లి ముక్కలు చల్లిన ఆనియన్ పెసరట్టు కూడా తిని ఉంటారు. అదే విధంగా ఓసారి సోయా ఉల్లి పెసరట్టు టేస్ట్ చూడండి. కొత్త రుచితో మీకు నచ్చడం ఖాయం. 


కావాల్సిన పదార్థాలు:


సోయా చంక్స్- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ (పెద్దది) - ఒకటి
పెసరపప్పు - రెండు కప్పులు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - ఒకటిన్నర స్పూను
కరివేపాకు - ఒక రెమ్మ
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - అర టీస్పూను


ALSO READ: పదేళ్ల ముందే మరణ సంకేతాలు కనిపిస్తాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?


తయారీ విధానం 


1. రెండు గంటల ముందే పెసరపప్పు నానబెట్టుకోవాలి. 


2.  సోయా చంక్స్ ను కూడా నీళ్లలో నానబెట్టాలి. ఇవి త్వరగా నానిపోతాయి కనుక కేవలం అరగంట ముందు నానబెట్టుకున్నా చాలు.


3. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు, సోయా చంక్స్, జీలకర్ర, అల్లం, మిరియాలపొడి, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అట్టుగా వేసుకునేందుకు వీలుగా ఆ రుబ్బులో అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పుని కూడా చేర్చాలి.


4. పెనం వేడి చేసి సరిపడా నూనె వేసి పెసరట్టును వేసుకోవాలి. రెండు వైపులా బాగా కాలాక పెసరట్టును తీసివేయాలి. 


5. దీన్ని కొబ్బరి చట్నీ లేదా గ్రీన్ చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. 


ALSO READ: ఈ రాశులవారి ప్రత్యర్థులు షార్ప్ గా ఉంటారు...మీరు జాగ్రత్త పడాల్సిందే..


పోషకాలు మెండు


సోయా చంక్స్ లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఎంత తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి.  పెసరపప్పులో కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుండె, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కనుక ఈ సోయా ఆనియన్ పెసరట్టు పెద్దలతో పాటూ పిల్లలు తిన్నా ఆరోగ్యమే. 


ALSO READ: కాన్ఫిడెన్స్‌కు కేరాఫ్ అడ్రస్.. ఈ మూడడుగుల బుల్లెట్


ALSO READ: గడ్డం ఉంటే అదో కిక్కు.. ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ని అమ్మాయిలే గడ్డం పెంచేయమంటున్నారు


ALSO READ: వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..