ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,657 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 178 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల్లో ఆరు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,438కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 190 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,046 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,140 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: కొత్త వేరియంట్‌పై కేంద్రం కీలక సూచనలు.. సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,624కి చేరింది. గడిచిన 24 గంటల్లో 190 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,140 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఆరు మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,438కు చేరింది.
కొత్త వేరియంట్ పై కేంద్రం జాగ్రత్తలు
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ వేరియంట్‌ను ఆందోళకర వైరస్‌గా డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే ప్రకటించింది. ఈ వేరియంట్ వెలుగుచూసిన దేశాలను ఇప్పటికే 'రిస్క్' కేటగిరిలో పెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ దేశాలను భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల పూర్తి వివరాలను సేకరిస్తోంది.
- అంతర్జాతీయ ప్రయాణికుల క్వారంటైన్, వారి కదలికిలపై నిఘా, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం సహా కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ సూచించారు.
- ఈ వైరస్ వ్యాప్తి అధికమైతే అందుకు తగ్గట్లుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల కిట్లు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక టెస్టింగ్ సదుపాయాలను రాష్ట్రాలు దగ్గర పెట్టుకోవాలి.
- హాట్‌స్పాట్‌లను గుర్తించడం తప్పనిసరి. ఎక్కువ కేసులు వచ్చిన క్లస్టర్‌ను గుర్తించి దానిని హాట్‌స్పాట్‌గా ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో వీలైనంత ఎక్కువగా టెస్టింగ్ చేయడం, పాజిటివ్ శాంపిళ్లను ఇన్సాకాగ్ పరిశోధనశాలకు పంపిచాలి. ఆ ప్రాంతంలో పాజిటివి రేటు ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
- ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం కూడా కీలకం. ఆరోగ్య సేవలను అందించడంలో ఏ మాత్రం ఆలస్యం కాకూడదు.
- దేశంలోని వేరియంట్లను గుర్తించేందుకు ఇన్సాకాగ్ ల్యాబొరేటరీలను స్థాపించింది ప్రభుత్వం. కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి.
- కొవిడ్ వేరియంట్లపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించాలి. వ్యాక్సినేషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి.
Also Read: దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి