ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 33,050 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 127 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,477కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 180 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,59,311 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1758 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read:  దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,546కి చేరింది. గడచిన 24 గంటల్లో 180 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1758 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,477కు చేరింది. 


Also Read:  మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్


దేశంలో 100కు చేరిన ఒమిక్రాన్ కేసులు


దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100 దాటేసింది. దిల్లీలో కొత్తగా 10 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 101కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది.


దిల్లీలో..


దేశ రాజధాని దిల్లీలో కొత్తగా మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. 20 మందిలో 10 మంది ఇప్పటికే నెగెటివ్ రావడంతో డిశ్ఛార్జ్. అయినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 77 దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించింది. ఒమిక్రాన్ సోకి యూకేలో ఒకరు మరణించారు. ఇదే ఒమిక్రాన్ తొలి మరణం.





కరోనా కేసులు..




దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. కొత్తగా 7,447 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 86,415కు చేరింది. తాజాగా 391 మంది వైరస్‌తో మృతి చెందారు. 7,886 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.38గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.


Also Read:  దేశంలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో వ్యాప్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి